మనిషి జీవితాన్ని జాతకం, వాస్తు (Vastu) వంటివి ప్రభావితం చేస్తాయి. చాలామంది జ్యోతిష్య పండితుల దగ్గర తమ జాతకాన్ని చూపించుకుంటారు. వారి సూచనల మేరకు పరిహారాలు చేయించుకుంటారు. వాస్తు కూడా అదే స్థాయిలో ప్రభావితం చేస్తుందని, చిన్న చిన్న టిప్స్ పాటించడం ద్వారా చికాకుల నుంచి బయటపడొచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
* ఈశాన్య దిశ (North east direction) : వాస్తుశాస్ర్తంలో ఈశాన్య దిశకు ప్రత్యేకమైన స్థానం ఉంది. దీన్ని అత్యంత శుభమైన ప్రదేశంగా భావిస్తారు. ఈశాన్యం అనేది జీవితకాల శ్రేయస్సు, ఆనందాన్ని ప్రసాదించే దిక్కుగా భావిస్తారు. అందుకే ఈ స్థానంలో ఎటువంటి బరువులు ఉంచరు. సింక్, టాయిలెట్, బాత్రూం వంటివి ఈ దిక్కులో ఉండకూడదు. ప్రవహించే నీరు ఉత్సాహానికి, సానుకూల దృక్పథానికి చిహ్నం.. కాబట్టి ఫౌంటేన్ లాంటిది ఉంటే మంచిదని, సుఖ, సంతోషాలతో ఉంటారని చెబుతున్నారు.
* ఏ వైపు తలపెట్టి పడుకోవాలి? : పురాణాల ప్రకారం మన ఉత్తరం వైపు తల పెట్టుకుని పడుకోకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం తల దక్షిణం వైపు ఉండేలా చూసుకోండి. మీ మంచం ముందు ఎటువంటి అద్దాలు ఉంచకూడదు. అవి మీ ఆరోగ్యాన్ని, శక్తిని ప్రభావితం చేస్తాయి. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)