జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతి గ్రహం కూడా నిర్దిష్ట సమయంలో రాశిని మార్చుతుంది. ఒక గ్రహం నుంచి మరొక గ్రహంలోకి వెళ్తుంది. దీనినే రాశిపరివర్తనం అంటారు. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ప్రభావం చూపుతుంది. ఏప్రిల్ 22న గురుగ్రహం.. మీనరాశిని వదిలి కుజుడి రాశి అయిన మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. (ప్రతీకాత్మక చిత్రం)
దేవగురువు బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్లేందుకు ఏడాది సమయం పడుతుంది. ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత మేషరాశిలోకి వెళ్తున్నాడు బృహస్పతి. గురు సంచారంతో కొన్ని రాశుల వారికి వృత్తి, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ధనలాభం కలుగుతుంది. మరి ఏయే రాశుల వారికి శుభం కలుగుతుందో తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
మేషం (Aries): బృహస్పతి సంచారము మేషరాశిలోనే జరుగుతున్నందున.. ఈ రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఏపని తలపెట్టినా...విజయవంతమవుతుంది. బృహస్పతి మీ జాతక చక్రంలోని లగ్న గృహంలోకి ప్రవేశిస్తుంది. అందువల్ల ఈ సమయంలో మీరు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం ( Cancer): బృహస్పతి సంచారం మీ రాశిలోని కర్మ గృహంలో జరుగుతుంది. ఇది పని, ఉద్యోగానికి సంబంధించినది. అందువల్ల ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి.. బృహస్పతి సంచార సమయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరంగా లాభాలు ఉంటాయి. వ్యాపారులు ఆశించిన లాభాలను పొందుతారు. ఈ కాలంలో మీ ఆదాయం పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
మీనం (Pisces): బృహస్పతి రాశి మార్పు మీన రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ జాతక చక్రంలోని రెండవ ఇంట్లో గురు సంచారము జరుగుతోంది. ఇది సంపద, వాక్కుకి సంబంధించినది. గురుగ్రహ సంచార సమయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త అందుతుంది. మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)