బుధుడి రాశి మార్పుతో మేషరాశి వారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం కోసం మీరు పెద్ద మొత్తంలో ఖర్చు చేసే అవకాశం ఉంది. మేష రాశి అధిపతి అంగారకుడు. అయితే బుధుడికి అంగారకుడికి శత్రుత్వం ఉందని జ్యోతిష్యం చెబుతుంది. దాంతో మేషరాశి వారు డిసెంబర్ 5 వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
శుక్ర గ్రహం కూడా వృశ్చికరాశిలోకి ప్రవేశించనుంది. ఈ మార్పు వల్ల మిథునరాశి వారికి చికాకులు తప్పేలా లేవు. జీవిత భాగస్వామి ఆరోగ్యంలో ఆందోళన పడే అవకాశం ఉంది. ప్రేమ విఫలం అయ్యే అవకాశం ఉంది. భారీ మొత్తంలో అనవసరపు ఖర్చులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)