జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నవంబర్ 13 రాత్రి 9:28 గంటలకు బుధ గ్రహం తులారాశిని వదిలి వృశ్చికరాశిలోకి ప్రవేశించబోతోంది. ఈ బుధ సంచారము ప్రతి రాశి వారి జీవితాలను ప్రభావితం చేయబోతోంది. ఈ బుధ సంచారంతో వృషభ రాశి వారితో పాటు సింహ, మకర, కుంభ రాశుల వారు తాము తలపెట్టిన పనుల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
నవంబర్ 16వ తేదీ రాత్రి 7.28 గంటలకు సూర్యుడు తులారాశిని వదిలి వృశ్చికరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్యుని సంచారము ప్రతి రాశిచక్రంలోని వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. సూర్యుడు ఈ రాశిలో ఒక నెల మొత్తం అంటే డిసెంబర్ 16 వరకు ఉంటాడు. సూర్యుని సంచారము వలన మిథున, కన్య, మకర, వృశ్చికరాశి రాశుల వారికి పెద్ద ఎత్తున ప్రయోజనకరంగా ఉండనుంది. ఈ రాశుల వారికి సమాజంలో గౌరవం లభిస్తాయి. ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. దీంతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)