Weekly Horoscope: ప్రతి వారం న్యూస్18 తెలుగు వారఫలాలను అందిస్తోంది. ప్రతి ఒక్కరికీ ఒక రాశి ఉంటుంది. ప్రతి రాశికీ మంచీ, చెడూ ఫలితాలు ఉంటాయి. ఏ రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? ఆర్థిక అంశాల్లో ఎలాంటి శుభాలు జరుగుతాయి? పంచాంగం ఎలాంటి అంశాలను సూచిస్తోంది? ఏయే శుభవార్తలను జ్యోతిషశాస్త్రం అందిస్తోంది? ఈ వారం రాశిఫలాలతో ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఏవైనా అవరోధాలు, కష్టాలు ఉంటే ముందుగానే వాటిని అంచనా వేసి.. సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలు కలుగుతుంది. ఈ వారం డిసెంబర్ 05, 2021 నుంచి డిసెంబర్ 11 వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి(Aries): ఆర్థికపరంగా మీరు ఒడ్డునపడతారు. అదృష్ట యోగం ఉంది. చాలా కాలంగా మీరు చేస్తున్న ఒక ప్రయ అత్నం ఈ వారం నెరవేరే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఎంతో అనుకూలంగా ఉంది. పెండింగ్ ప నుల్లో చాలా భాగం పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో అభిప్రాయభేదాలు ఏర్పడతాయి. కొన్ని వ్యక్తి గత సమస్యలు మిత్రుల సహాయంతో పరిష్కారం అవుతాయి. గతంలో మీ దగ్గర డబ్బు తీసుకున్నవా రు తిరిగి తెచ్చి ఇస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు లాభాలపరం గా అభివృద్ధికి అవకాశం ఉంది.
వృషభం (Taurus): ఉద్యోగంలో కొన్ని చిక్కులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. ఒక పెద్ద సంస్థ నుంచి వేరే ఉద్యో గానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఎవరితోనూ విభేదించకుండా పనులు పూర్తి చేసుకోండి. కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులను సంప్రదించండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. విశ్రాంతి చాలా అవసరం. వృత్తి, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయానికి లోటు ఉండదు. తిప్పట ఉన్నా, కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిం చవచ్చు. స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగాలవారికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
మిథునం (Gemini): ఉద్యోగంలో ఇంత కాలంగా పడుతున్న శ్రమ సత్ఫలితాలనిస్తుంది. అనుకూల మార్పులు చోటు చేసు కుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో మీరు పెట్టిన పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం దక్కవచ్చు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. మీ తప్పులు, పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుని, కొత్త నిర్ణయాలు తీసుకోండి. ఈ వారం కొద్దిగా ధన యోగం పడుతుంది. ఉద్యోగానికి సంబంధించి నిరుద్యోగులకుకొన్ని ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయి. మీ పిల్లలలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
కర్కాటకం (Cancer): కుటుంబ జీవితంలో తలెత్తిన పొరపచ్చాలు సమసిపోయే అవకాశం ఉంది. చక్కని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. గత కొన్ని వారాల కంటే ఈ వారం మీ వ్యాపారం చాలా వరకు మెరుగుపడుతుంది . మొత్తం మీద ఈ వారం మీకు అన్ని విధాలా అనుకూలమైన సమయమని చెప్పవచ్చు. ఎంతో ఉత్సా హంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల నుంచి సాయం అందుతుంది. ఐ. టి, వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగుంది. మీ ప్రేమ జీవితం ఒక కొత్త మలు పు తిరిగే అవకాశం ఉంది.
సింహం (Leo): అనుకోకుండా మంచి ఉద్యోగం ఆఫర్ వస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. మీ జీవితంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. ఏ ఆటంకాలూ లేకుండా పనులు పూర్తి చేసుకుంటారు. గ్రహాలు చాలావరకు మీకు అనుకూలంగా ఉన్నాయి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలతో కొన్ని కుటుం బ సమస్యల నుంచి బయటపడతారు. కొందరు మిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. వృత్తి, వ్యాపారా ల్లో ఉన్నవారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాలవారికి సమయం అనుకూలం.
కన్య (Virgo): వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగం మీద బాగా శ్రద్ధ పెట్టాల్సిన సమయం ఇది. ఆదాయానికి, ఆరోగ్యానికి డోకా ఉండదు. కొన్ని వ్యక్తిగత సమస్యలు కారణంగా ఇబ్బందులు ప డతారు. చాలా కాలంగా వ్యాజ్యంలో చిక్కుకున్న ఆస్తి ఒకటి మీ పరమవుతుంది. కళా సాహిత్య రంగా ల్లో ఉన్నవారికి క్షణం తీరికి ఉండదు. పెండింగ్ లో ఉన్న పనులలో చాలావరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీ ఉం డి బాగా నష్టపోతారు. కొన్ని పనుల విషయంలో ఇంటా బయటా బాగా ఉండవచ్చు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
తుల (Libra): ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి నిపుణులకు, వ్యాపారులకు అనుకూల సమయం. ఊహించని విధంగా ఒక మంచి సంస్థ నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. సరైన నిర్ణయాలు తీసుకుని కార్యాచరణకు దిగాల్సిన సమయం ఇది. వ్యాపారంలోకి దిగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుం ది. అనవసర ఖర్చులకు కళ్లెం వేయాల్సి ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఒక వ్య క్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
వృశ్చికం (Scorpio): ఉద్యోగంలో అధికారులు మీ శక్తి సామర్థ్యాలను గుర్తించి కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి పెరిగినా సత్ఫలితాలకు అవకాశం ఉంది. ముఖ్యమైన పనులలో బాగా తిప్పట ఉంటుంది. ఆశించిన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. గతంలో మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.
ధనస్సు (Sagittarius): ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో కొత్త సవాళ్లు ఎదురవుతాయి. మీకు స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. మీ లో ఆత్మవిశ్వాసం పెరిగి, జీవితానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో మీ తెలివి తేటలను తక్కువ అంచనా వేసినవారు మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు. ఆరోగ్యానికి, ఆదాయానికి డోకా లేదు. సమాజంలో పలుకుబడి కలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు వింటారు . ఇంజనీర్లకు, ఐ.టి నిపుణులకు, లాయర్లకు అన్నివిధాలా బాగుంటుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది.
మకరం (Capricorn): ఈ వారం ఆర్థికంగా బాగుంటుంది. గతంలో జరిపిన ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. సూ ద్యోగుల సహకారంతో ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇప్పుడు ఏర్పడ్డ పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఏలిన్నాటి శని కారణంగా కారణంగా ప్రతి పనీ ఆల స్యం అవుతుంది. నమ్మినవారు మోసం చేసే సూచనలున్నాయి. తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృ ప్తి కలిగిస్తాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పవు. రాజకీయ, సామాజిక రంగాలవా రు అభివృద్ధి సాధిస్తారు.
కుంభం (Aquarius): ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి ఎక్కువవుతాయి. సహైద్యోగులతో విభేదాలకు అవకాశం ఉంది. పట్టుదలగా పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యు లతో ఎక్కువ సమయం గడుపుతారు. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. మిత్రులతో కలిసి సే వా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. లాభాలు గడిస్తారు. వృత్తి నిపుణులకు, టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అనుకూల సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి చోట ఉద్యోగం లభించే అవకాశం ఉంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదరవచ్చు.
మీనం (Pisces): వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటారు. కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుం టారు. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపా రాల్లో శ్రమ, ఒత్తిడి పెరిగినా సత్ఫలితాలనిస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి బా గుంటుంది. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.