Astrology: రేపటి నుంచి ఈ రాశుల వారి దశ తిరుగుతుంది.. డబ్బే డబ్బు..!
Astrology: రేపటి నుంచి ఈ రాశుల వారి దశ తిరుగుతుంది.. డబ్బే డబ్బు..!
Astrology: సోమవారం నుంచి కొన్నిరాశుల వారికి మంచి రోజులు రాబోతున్నాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోయి.. చేతి నిండా డబ్బు ఉంటుందట. మరి మీరు కూడా ఆ జాబితాలో ఉన్నారో లేదో చెక్ చేసుకోండి.
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల గమనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహాల కదలికలో మార్పు ప్రభావం మొత్తం 12 రాశుల మీద కనిపిస్తుంది. కొందరికి శుభాలు కలిగితే.. మరికొందరికి అశుభ ఫలితాలు వస్తాయి. మార్చి 25న బుధుడు, బృహస్పతి ఒకే నక్షత్రంలోకి వస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
రేవతీ నక్షత్రంలో ఈ రెండు గ్రహాలు కలిసి రావడం వల్ల.. వచ్చే వారంలో అంటే మార్చి 27 నుండి మార్చి 31, 2023 వరకు పలు రాశుల అదృష్టవంతులు కాబోతున్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు సంపాదన పెరుగుతుంది. మరి ఏయే రాశుల వారికి ఈ ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
వృషభం (Taurus): వృషభ రాశి వారు ఆకస్మిక ధనలాభం పొందుతారు. పూర్వీకుల ఆస్తులతో లాభపడతారు. డబ్బు సంపాదించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మార్చి చివరి వారంలో సంపాదన బాగా ఉంటుంది. తోబుట్టువుల సహకారం ఉంటుంది. కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
మిథునం (Gemini): కెరీర్ పరంగా ఇది మీకు గోల్డెన్ పీరియడ్. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఆస్తి, వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగం చేస్తే మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. మీతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా బాగుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
వృశ్చికరాశి (Scorpio): మీ 5వ ఇంట్లో బుధుడు, బృహస్పతి కలిసి శుభ ఫలితాలను ఇస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బలంగా ఉంటుంది. కొంత కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
ధనుస్సు (Sagittarius): ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. మీరు కోరుకున్న ఉద్యోగం పొందే అవకాశాలున్నాయి. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. పదోన్నతి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
కుంభం (Aquarius): వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. ధనలాభం పొందుతారు. మీరు మీ ప్రసంగంతో ప్రజలను ఆకర్షిస్తారు. ఈ సమయం ఉపాధ్యాయులకు కూడా శుభప్రదంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)