మనం ఇంట్లో నుంచి బైటకు వెళ్లిన పని అవ్వాలను కుంటాం. దీని కోసం దినఫలాలు చూస్తుంటాం. మంచి టైమ్ చూసి మరీ బయటకు వెళ్తాం. అయితే, చాలా మంది కొందరి ముఖం చూస్తే కలిసి వస్తుందని నమ్మకం ఉంటుంది. అందుకే కొందరు తల్లి ముఖం, మరికొందరు వారి పిల్లల ముఖం చూసి పనిమీద వెళ్తుంటారు. ఇంకొందరికి తమ భార్య ఎదురొస్తే.. పని అవుతుందని నమ్ముతుంటారు.
అయితే, ప్రతి ఒక్కరు తమ తమ నమ్మకాలను అనుగుణంగా తమకు ఇష్టమైన వారి ముఖాలను చూసి బయటకు వెళ్తుంటారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రకాల పదార్థాలను ఇంట్లో నుంచి బయటకు వెళ్లటప్పుడు నోట్లో వేసుకొని వెళ్లడం వలన అనేక శుభఫలితాలు వస్తాయని సూచిస్తుంటారు. అందుకే అలాంటి పదార్థాలను తినాలని సూచిస్తుంటారు.
అందుకే పెద్దలు తరచుగా ఏదైన శుభకార్యం అనుకొగానే నోరు తీపి చేస్తుంటారు. అలాగే.. కొంత మంది ఏపని చేసిన తీపి పదార్థాలను తిని ప్రారంభిస్తారు. దీని వలన వారు చేపట్టబోయే పనులు నిర్విఘ్నంగా సాగుతాయని నమ్ముతుంటారు. అదే విధంగా, గణపతికి బెల్లం అంటే ఎంతో ఇష్టం. అందుకే ఇంట్లో నుంచి బైటకు వెళ్లేటప్పుడు చిటికేడు బెల్లం నోటిలో వేసుకుని వెళ్తే పని సక్సెస్ అవుతుంది.
బయటకు వెళ్లేటప్పుడు వినాయకుడిని తలచుకొని ఆయనకు సమర్పించి.. ప్రసాదంగా తింటున్నట్లు నోటిలో బెల్లం లేదా చక్కెర వేసుకుని బైటకు వెళితే తప్పనిసరిగా శుభ ఫలితాలు కల్గుతాయని అనేక జ్యోతిష శాస్త్రాలు చెబుతున్నాయి. కాసింత బెల్లం లేదా చక్కెర వేసుకొని దేవుని పేరు తలుచుకునిన బైటకు అన్ని పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి. ఒక వేళ కానీ పనులు కూడా మనకు అనుకూలంగా మారతాయి.