హిందూ మతంలో అత్యంత పవిత్రమైన రోజుగా గంగా దసరా (Ganga Dussehra) పండుగను పరిగణిస్తారు. జ్యేష్ఠ శుక్ల పక్షంలోని పదవ రోజున గంగా దసరా పండుగను జరుపుకుంటారు. ఈ పర్వదినాన గంగా దేవి దివి నుంచి భువికి దిగి వచ్చిందని హిందువులు నమ్ముతుంటారు. ఈ సంవత్సరం గంగా దసరా పండుగను జూన్ 9న (June 9) జరుపుకుంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
భగీరథ రాజు కఠినమైన తపస్సు వల్లనే గంగా దేవి భూమిపైకి రావడం సాధ్యమైందని పండితులు చెబుతుంటారు. అయితే గంగానది వేగాన్ని తట్టుకునే శక్తి భూమికి లేనందున, శివుడు ఆమెను తన జుట్టు మధ్యలో ఉంచాడని, తద్వారా గంగా జలం (Ganges Water) ప్రవాహం రూపంలో భూమిపైకి దిగి వచ్చిందని చెబుతారు. అందుకే ఈ రోజున గంగామాత సమేతంగా శివుడిని పూజించడం చాలా ముఖ్యం. ఈ పండుగ ప్రాముఖ్యత, పూజ ఎలా చేయాలి వంటి వివరాలు తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
గంగా దసరా 2022 ప్రాముఖ్యత
ఈ శుభదినాన గంగానదిలో స్నానం చేయడం ద్వారా పాప పుణ్యాలు తొలగి పుణ్యఫలాలు లభిస్తాయి. అయితే గంగా నదిలో స్నానం చేయడం కుదరకపోతే.. గంగా దేవిని ధ్యానిస్తూ మరే ఇతర పవిత్ర నదిలోనైనా స్నానం చేయవచ్చు. లేదంటే మీ ఇంట్లో స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలిపి వాటితో స్నానం చేయవచ్చు. ఆ తర్వాత గంగా దేవికి ముకుళిత హస్తాలతో నమస్కరించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
గంగా దసరా 2022 ప్రత్యేక చర్యలు
గంగా దసరా రోజున వివిధ శుభాలు జరిగేందుకు, ప్రత్యేక కోరిక తీరేందుకు, ఆరోగ్యం కోసం, దీర్ఘాయుష్షును పొందడం కోసం, వ్యాపారంలో లాభాలు రావడానికి, అన్ని రకాల ఇబ్బందుల నుంచి బయటపడటానికి, విజయం సాధించడానికి, ఉద్యోగ సంబంధిత ఇబ్బందులను తొలగించడానికి కొన్ని ప్రత్యేక పూజలు చేయాలని, మంత్రాలు జపించాలని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- మీలో అన్ని శక్తులను నింపాలనుకుంటే ఈరోజు 'ఓం నమః శివాయై గంగాయే శివదాయై నమో నమః. నమస్తే విష్ణురూపిణ్యై, బ్రహ్మమూర్తియై నమోస్తుతే' అని ఐదు సార్లు జపించడం ద్వారా మీలో అపారమైన శక్తి ఉన్నట్లు అనుభూతి చెందుతారు. ఏదైనా ప్రత్యేక కోరిక త్వరలో నెరవేరాలని కోరుకుంటుంటే.. శాంతయై చవర్దీయై వరదాయై నమో నమః అని జపించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
- వ్యాపారాన్ని పెంచుకోవాలనుకుంటే, ఈ రోజు మీరు ఏదైనా పానీయాన్ని దానం చేయాలి. ఒక బ్రాహ్మణునికి నీళ్లు అందించాలి. మీరు ఏది దానం చేసినా అది పదిమందికి దానం చేయాలి. అంటే, మీరు 10 మంది బ్రాహ్మణులకు తాగునీరు అందించాలి. ఒక పాత్రను విరాళంగా కూడా అందించవచ్చు. పదిమంది బ్రాహ్మణుల ఆశీర్వాదాలు తీసుకోవచ్చు. మీ ఇంటి చుట్టూ బ్రాహ్మణులు పదిమంది లేకపోతే బ్రాహ్మణుని పాదాలు పదిసార్లు తాకాలి. ఇలా చేస్తే పుణ్యం వస్తుందని, వ్యాపారం కూడా పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)