మేషం: మేష రాశి నుంచి బృహస్పతి 11వ గృహంలో ఉదయిస్తాడు. దీనిని ఆదాయ స్థానంగా పిలుస్తారు. ఈ సమయంలో మీ ఆదాయం పెరుగుతుంది. అలాగే కొత్త ఆదాయ వనరులను సృష్టించుకోవచ్చు. వ్యాపారంలో లాభాలు పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. అలాగే స్థలం మారే అవకాశాలున్నాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాన్ని ఖరారు చేయవచ్చు. ఇది భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
వృషభం: బృహస్పతి ఉదయం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. బృహస్పతి మీ రాశి నుంచి పదవ గృహంలో ఉదయిస్తాడు. దీనిని కార్యస్థానం, వ్యాపారం, పని క్షేత్రం అని పిలుస్తారు. అందువల్ల ఈ సమయంలో మీరు కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నట్లయితే ప్రమోషన్ పొందవచ్చు. కొత్త వ్యాపారానికి అనుకూల సమయం. మీ వర్కింగ్ స్టైల్ మెరుగుపడుతుంది. తద్వారా ఆఫీసులో ప్రశంసలు అందుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
సింహం: మీ రాశి నుంచి బృహస్పతి ఏడవ గృహంలో ఉదయిస్తున్నాడు. దీనిని వైవాహిక జీవితం, భాగస్వామ్య గృహంగా పిలుస్తారు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది. పెళ్లి కాని వారు వివాహ ప్రతిపాదనను పొందుతారు. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలను పొందవచ్చు. సింహ రాశికి అధిపతి సూర్య దేవుడు. సూర్యుడు, బృహస్పతి గ్రహాల మధ్య స్నేహ భావం ఉన్నందున.. ఈ సమయం మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)