వృషభం (Taurus): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారి లగ్న గృహంలో రాజయోగం ఏర్పడుతోంది. ఈ ప్రభావం వల్ల వృషభ రాశి వారు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగంలో పురోగతితో ఆదాయం పెరుగుతుంది. చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారులకు ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
సింహం (Leo): సింహ రాశి వారికి బుధ, శుక్రుల కలయిక రాజయోగానికి కారణమవుతుంది .ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం లభిస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. భాగస్వామ్యంతో చేపట్టే పనుల్లో ఆశించిన స్థాయిలో లాభం ఉంటుంది. పెట్టుబడులకు ఇదే సరైన సమయం. ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
కుంభం (Aquarius): బుధు, శుక్ర గ్రహాలు కుంభరాశిలో శష, మాళవ్య రాజయోగాన్ని ఏర్పరుస్తారు.ఈ సమయంలో మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. .ఇల్లు, ఇంటికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు.శుభ కార్యాలకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. రాజయోగ ప్రభావం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)