వృషభం (Taurus): అంగారక యోగం వృషభ రాశి నుంచి పన్నెండవ గృహంలో ఏర్పడుతుంది. ఇది నష్టాలు, ఖర్చులకు సంబంధించినది. అందువల్ల ఈ సమయంలో మీ ఖర్చులు పెరుగుతాయి. బడ్జెజ్ దెబ్బతింటుంది. మీరు మీ తోబుట్టువులతో గొడవ పడవచ్చు. కాబట్టి మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. ఈ సమయంలో శత్రువులు మీకు వ్యతిరేకంగా ఏదైనా కుట్ర చేయవచ్చు. వ్యాపారంలో ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుండా ఉంటే మంచిది. లేకుంటే నష్టాలు సంభవించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
సింహం (Leo): అంగారక యోగం సింహ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో ఏర్పడుతుంది, ఇది అదృష్టం, విదేశీ ప్రయాణాలకు స్థానం. ఈ సమయంలో మీకు అదృష్టం కలిసి రాదు. ఏదైనా పెద్ద ఒప్పందం ఖరారు అయ్యే సమయానికి ఆగిపోవచ్చు. మీరు విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే.. అది కొన్ని కారణాల వల్ల రద్దయ్యే అవకాశముంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. బయటి ఆహారాన్ని తినడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
తుల (Libra): ఉన్నత విద్య, ప్రేమ వివాహ స్థలంగా భావించే ఐదవ గృహంలో అంగారక యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీరు ప్రేమ వ్యవహారాలలో వైఫల్యాన్ని ఎదుర్కోవచ్చు. ఉన్నత విద్యలో ఆటంకాలు ఉండవచ్చు. కుటుంబంలో గొడవలు జరిగే అవకాశముంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావచ్చు. ఆఫీసులోనూ జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగులు మీతో గొడవ పెట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం).