* తుల రాశి : ఈ రాశివారు పుచ్చుకోవడం కంటే ఇచ్చుకోవడం ద్వారానే ఎక్కువగా సంతోషంగా ఉంటారు. తమకు ఎన్నో సమస్యలు ఉన్నా.. ఇతరులు ఏదైనా సహాయం కోసం వస్తే కాదనలేరు. ఇతరులను నొప్పించడం ఈ రాశివారికి చేతకాదు. అందరితో మర్యాదగా ప్రవర్తిస్తారు. వర్క్‌లో కొలీగ్స్‌కు సాయం చేయడానికి నిరంతరం ముందు ఉంటారు. అందుకు ఎంత దూరమైనా వెళ్తారు.
* కర్కాటక రాశి : ఈ రాశివారు మీ కొలీగ్ అయితే, వారు నిజంగా మీ గురించి శ్రద్ధ తీసుకుంటారు. కర్కాటక రాశి వారు ఎల్లప్పుడు ఇతరుల క్షేమం గురించి లోతుగా ఆలోచిస్తుంటారు. ప్రజల జీవితాల్లోని వ్యత్యాసాలను నిరంతరం గమనిస్తుంటారు. ఈ రాశివారు పనిలో చాలా సంతృప్తిగా ఉంటారు. మీరు ఎప్పుడైనా పనిలో లేదా సాధారణ జీవితంలో ఇబ్బందుల్లో చిక్కుకుపోతే.. మీకు సహాయం చేయడానికి కర్కాటక రాశివారు సిద్ధంగా ఉంటారు. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ మీకు తోడుగా, రక్షణగా ఉంటారు. ఇతరులపై కరుణతో, దయతో ఉంటారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే చలించిపోతారు. ఏ రూపంలోనైనా సాయం చేయడానికి తమ వంతు కృషి చేస్తారు.
* కన్య రాశి : ఈ రాశివారు హేతుబద్ధతకు ప్రతిబింబంలా ఉంటారు. ప్రతి విషయాన్ని బాగా పరిశీలిస్తుంటారు. అనవసరంగా ఇతరుల జోలికి వెళ్లరు. ఈ లక్షణం కారణంగా సహోద్యోగులకు బాగా దగ్గరవుతారు. ఈ రాశివారు ప్రతీదీ పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటారు. పనిలో కూడా ఎలాంటి తప్పులకు తావు ఇవ్వరు. పైగా ఇతరులు కూడా అలానే ఉండాలని డిమాండ్ చేస్తారు. వర్క్ విషయంలో ఎవరికైనా సహాయం చేయడానికి, ఏదైనా సరిదిద్దాల్సి వస్తే ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. సహ ఉద్యోగుల విషయంలో ఏదైనా సహాయం చేయాలంటే ఖర్చుకు వెనుకాడరు.
* సింహ రాశి : ఈ రాశివారు చూడటానికి అహంకార స్వభావం ఉన్న వ్యక్తులా కనిపిస్తున్నప్పటికీ.. వారిలో ఈగో తక్కువగా ఉంటుంది. ఒరిజినాలిటీ, క్రియేటివిటీపై వచ్చే ప్రశంసలు, అభినందలను తెగ ఎంజాయ్ చేస్తారు. పనిని పొందడానికి, ప్రతిఫలంగా ప్రశంసలు అందుకోవడం కోసం ఎంతో శ్రమిస్తారు. పని కోసం ఇతరులను అడగటానికి కూడా వెనుకడుగు వేయరు. పని పొందడం కోసం వీరు అసాధారణమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉపయోగిస్తారు. సహ ఉద్యోగులకు వర్క్‌లో లేదా పర్సనల్‌గా కూడా సహాయం చేస్తుంటారు. ఇతరులను సంతోషపెట్టడం ఈ రాశులకు ఉండే సహజ లక్షణం. తమ ఉన్నతాధికారులు లేదా సహోద్యోగులు ఏదైనా చేయమని కోరితే తప్పకుండా అందుకు అంగీకరిస్తారు.