కర్కాటక రాశి : ఈ రాశివారు ప్రేమ లేకుండా జీవించలేని భావోద్వేగ జీవులు. కానీ అదే సమయంలో బ్రేకప్ లేదా ద్రోహం నుండి తమను తాము రక్షించుకోవడానికి కోల్డ్ హార్ట్‌గా ఉంటారు. అయితే సున్నితమైన స్వభావం కారణంగా విపరీతమైన బాధను తట్టుకోలేరు. దీంతో కర్కాటక రాశివారు దయగా, అందరితో మంచిగా ప్రవర్తిస్తుంటారు. అయితే భాగస్వామి పట్ల పూర్తి నమ్మకం వచ్చేవరకు తమ విషయాలను అసలు పంచుకోరు.
కన్య రాశి : ఈ రాశివారు ఇతరుల పట్ల కఠినంగా, మొరటుగా ప్రవర్తించడానికి ఏ మాత్రం భయపడరు. ఇతరులను సంతోషపెట్టడాన్ని ద్వేషిస్తారు. దీంతో వారు చాలా క్రూరమైన స్వభావం ఉన్నవారని అని ప్రజలు అనుకుంటారు. వారు ప్రతిదానిపై నియంత్రణను కోరుకుంటారు. అధికారం చెలాయించాలనుకుంటారు. ఇతరులు నచ్చకపోతే చాలా నీచంగా భయానక పరిస్థితులను చూపిస్తారు.
వృశ్చిక రాశి : వారి మనస్తత్వం చాలా మిస్టీరియస్‌గా ఉంటుంది. ఇతరులు కొంచ్చెం ఇబ్బంది పెట్టిన అసలు తట్టుకోరు. వారిని తిరిగి బాధపెట్టడానికి క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. వారు దేనినైనా తారుమారు చేయగలరు. పరిస్థితులు చెయ్యి దాటిపోయినప్పుడు శత్రుత్వం కూడా చేయవచ్చు. దీనిబట్టి వృశ్చిక రాశివారికి కోపం తెప్పించకపోవడం మంచిది.
ధనస్సు రాశి : వారు ఎవరిపైనా సులభంగా ప్రేమ చూపించరు. కొంత కఠినంగా ఉంటారు. వారు తమ హృదయాన్ని చాలా విలువైనదిగా కాపాడుకుంటారు. ఎందుకంటే వారు ఇతరుల వల్ల ఇబ్బందులు పడతానేమోనని భయపడుతుంటారు. ప్రేమ, భావోద్వేగాల విషయానికి వస్తే చాలా సున్నితంగా ఉంటారు. దీంతో తమను తాము రక్షించుకోవడానికి వారు ఉత్తమమైన మార్గంగా భావిస్తారు.