మీరు గమనించే ఉంటారు... కొన్ని ఇళ్లు చూడటానికి అద్భుతంగా ఉంటాయి... కానీ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు ఉండవు. ఎప్పుడూ ఏవో ఒక గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇందుకు కారణం నెగెటివ్ ఎనర్జీయే అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటే... ఆ ఇంట్లోని వారికి అష్టైశ్వర్యాలూ లభిస్తాయంటున్నారు. దీన్ని నమ్ముతున్న ఎంతో మంది ఇల్లు కట్టుకునేటప్పుడు పాజిటివ్ ఎనర్జీ వచ్చేందుకు ఏం చెయ్యాలో అన్నీ చేయిస్తున్నారు.
భారతీయ వేదాల్లోనే వాస్తు శాస్త్రం ఉంది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత వాస్తు శాస్త్రాన్ని నమ్ముతున్నాయి. ఇంట్లో సాంతి, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం వంటివి ఉండాలంటే... కొన్ని వాస్తు సూత్రాలు పాటించాలి. తద్వారా ఇంట్లోని వారికి ఒత్తిడి, అనారోగ్యాలు, విపరీత పరిణామాలు జరగకుండా ఉంటాయంటున్నారు. సూర్య కిరణాలతోపాటూ... అంతరిక్షం నుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీ ఇంట్లోకి రావడానికి ఏం చెయ్యాలో తెలుసుకుందాం.
Wind chimes: విండ్ చిమ్స్ అనేవి... చిన్న గాలి వచ్చినా... అటూ ఇటూ కదులుతూ... మంచి శబ్దాలు చేస్తాయి. ఆ మ్యూజిక్ మనకు వినసొంపుగా ఉంటుంది. ఆ మ్యూజిక్ నుంచి వచ్చే శబ్ద తరంగాలు... నెగెటివ్ ఎనర్జీని ఆపేస్తుంది. ఫలితంగా మ్యూజిక్ ద్వారా వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఇల్లంతా చేరుతుంది. అందువల్ల ఇంట్లోకి గాలి వచ్చే చోట... వీటిని అమర్చండి.
Sea Salt: ఉప్పు ఎంత పవర్ఫుల్లో చాలా మందికి తెలియదు. ఉప్పుకి నెగెటివ్ ఎనర్జీని పీల్చేసుకునే శక్తి ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఓ గిన్నెలో గుప్పెడు ఉప్పు వేసి... గదిలోని ఓ మూల ఉంచాలి. ఇలా ప్రతి గదిలోనూ ఉంచాలి. వారానికోసారి ఆ ఉప్పును బయట పారవేసి... మళ్లీ కొత్త ఉప్పుతో ఉంచాలి. ఇది గల్లుప్పు అయి ఉండాలి.
Negative energy and lemons: గ్లాస్ నీటిలో ఓ నిమ్మకాయను ఉంచడాన్ని మీరు షాపుల్లో చూసే ఉంటారు. ఇలా ఇళ్లలో కూడా చేయవచ్చు. నిమ్మకాయలకు నెగెటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంటుంది. నీటిలో నిమ్మకాయలు ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. ప్రతి శనివారం ఆ నీటిని, నిమ్మకాయనూ తొలగించి... కొత్త నీరు, కొత్త నిమ్మకాయను పెట్టుకోవాలి.
Convex Mirror on the wall: ఇంటి బయట గోడకు ఓ కాన్వెక్స్ అద్దాన్ని సెట్ చేస్తే మంచిదే. బయటి నుంచి వచ్చే నెగెటివ్ ఎనర్జీ... అద్దంలో తనను తాను చూసుకొని... అటు నుంచి అటే పారిపోతుందని పండితులు చెబుతున్నారు. (Photo Source: Collected) (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)