ఈ రోజు ప్రధానంగా ఉతికిన బట్టలు మాత్రమే వేసుకొవాలి. మాసిపోయిన బట్టలు, వేసుకున్న బట్టలు,దండం మీద ఉంచిన బట్టలు మరల వేసుకొవడం వంటి పనులు అసలు చేయకూడదు. శుభ్రమైన బట్టలు ధరించి.. అమ్మవారిని ఆరాధించాలి. అంతే కాకుండా శుక్రవారం రోజు వ్రతం చేసి... రాత్రిపూట వంటగదిని కడగేయటం, గ్యాస్ స్టవ్ ను తుడిచేయడం చేయకూడదు.
అదే విధంగా.. శుక్రవారం రోజుల ఇల్లాలు ఇంటిలో బూజు దులపడం వంటి పనులు కూడా చేయకూడదు. అంతే కాకుండా.. ఇల్లాలు మనసు నోచ్చుకునే మాటలు మాట్లాడకూడదు. భార్యను సూటిపోటి మాటలతో వేధించకూడదు. మెయిన్ గా ప్రతి ఒక్కరు ఇవన్ని పాటిస్తు.. అమ్మవారిని భక్తితో అర్చిస్తే.. ఆ చల్లని తల్లి అనుగ్రహంతో మనం కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి.