లోహ వస్తువులు : మీరు నిద్రపోయే స్థలం అనేది ఎంట్రాన్స్ కు ఎదురుగా ఉన్న గోడకు చివరిలో ఉంటే.. అక్కడ ఏదైనా లోహపు వస్తువును పెట్టండి. వాస్తుశాస్త్రం ప్రకారం ఈ స్థలాన్ని సంపదకి ( Wealth ) నెలవుగా చెబుతారు. గుర్తుంచుకోండి ఈ స్థలంలో గోడకు పగుళ్లు వచ్చినా, విరిగినా రిపెయిర్ చేయించండి. అలా ఉంచడం మంచిది కాదు.
ఇంట్లో చెత్త పెట్టుకోకండి : ఇంట్లో విరిగిన వస్తువులు, చెత్తను ఉంచకండి. దీంతో ఇంట్లో ప్రతికూలత పెరుగుతుంది. నెగెటీవ్ ఎనర్జీ ప్రవాహం పెరుగుతుంది. విరిగిన మంచాన్ని కూడా ఇంట్లో ఉంచరాదు. దీని వల్ల ఆర్థిక లాభాల్లో తరుగుదల కలుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. చాలా మంది తమ ఇంట్లో మెట్లకింద పాత సామాన్లు పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల ధనప్రాప్తిలో ఇబ్బందులు కలుగుతాయి.