Astrology 2023 : వచ్చే 7 రోజుల పాటు ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఊహించని ధన లాభం కూడా..
Astrology 2023 : వచ్చే 7 రోజుల పాటు ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఊహించని ధన లాభం కూడా..
Astrology 2023 : ప్రతి రాశికి దాని సొంత స్వభావం, వ్యక్తిత్వం, ప్రత్యేకత ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశుల ప్రస్తావన ఉంది. ఒక్కో రాశికి ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటుంది. వీటి ప్రభావం మనిషి జీవితంపై పడుతుంది.
వచ్చే ఏడు రోజుల పాటు పలు గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి. దాంతో కొన్ని రాశుల వారు వచ్చే 7 రోజుల పాటు భారీగా లాభ పడే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం).
2/ 8
కన్య రాశి : వచ్చే వారం రోజుల పాటు కన్య రాశి వారు అధిక మొత్తంలో లాభ పడే అవకాశం ఉంది. వీరు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఈ వారం అనేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
తులారాశి : ఫిబ్రవరి 6 నుంచి 13 మధ్య తులారాశి వారు చాలా సృజనాత్మకంగా ఉంటారట. ఇది వారికి ప్రత్యేక ప్రయోజనాలను కూడా ఇస్తుంది. మీరు మీ పనితో సంతృప్తి చెందుతారు.సంఘంలో గౌరవం కూడా దక్కుతుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభం అని జ్యోతిష్యం పేర్కొంటుంది. (ప్రతీకాత్మక చిత్రం).
4/ 8
ధనస్సు రాశి : ఈ వారం మీ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ దక్కే అవకాశం ఉంది. ఇది మీలో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తోంది. వ్యాపారంలో ఉన్న వారికి పెద్ద కాంట్రాక్ట్ దక్కే అవకాశం ఉంది. ఆరోగ్యంపై కాస్త శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం).
5/ 8
మకర రాశి : మకర రాశి వారికి ఈ వారం లక్కీ కాలంగా చెప్పవచ్చు. కోర్టు సమస్యలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దాంతో మీ ఆస్తి మీకు దక్కే అవకాశం ఉంది. ఇది మీలో ఆనందానికి కారణం అవుతుంది. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. (ప్రతీకాత్మక చిత్రం).
6/ 8
కుంభ రాశి : కుంభ రాశి వారు కొత్త పనుల్లో బిజీగా ఉంటారు. ఆర్థిక పరిస్థితులు సాధారణ పరిస్థితులకు చేరుకుంటాయి. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించవచ్చు. రాజకీయాల్లో చురుగ్గా ఉండే వ్యక్తులు లాభపడతారు. (ప్రతీకాత్మక చిత్రం).
7/ 8
మీన రాశి : మీన రాశి వారికి ఈ వారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పెద్ద అవకాశం తలుపు తట్టనుంది. శుభవార్తలు వింటారు. అందులో ఒకటి డబ్బుతో ముడిపడి ఉంటుంది. మొత్తంమీద.. ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం).
8/ 8
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. (ప్రతీకాత్మక చిత్రం)