బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో ఒకరైన పరమేశ్వరుడికి సోమవారం ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. అందువల్లే భక్తులు ఆయనకు ప్రతి సోమవారం తెల్లవారుజాము నుంచే పూజలుచేస్తారు. భక్తితో మొక్కులు చెల్లిస్తారు. ఐతే... మహదేవుడి ఆశీస్సులు అంత ఈజీగా రావు. పూర్వం కఠోర తపస్సులు చేస్తే తప్ప స్వామి కరుణించేవారు కాదు. మరి మనం కూడా అలా చెయ్యాలంటే చాలా కష్టం. అందుకే ఈ రోజుల్లో భక్తులు స్మార్ట్ రూట్ వెతుక్కున్నారు. స్వామికి ఏది ఇష్టమో అదే సమర్పించడం ద్వారా అనుగ్రహం పొందుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
మహా శివుడికి బిళ్వ (Bilwa Leaf) వృక్షం ఆకులన్నా, పువ్వులన్నా చాలా ఇష్టం. ఈ పువ్వుల సైంటిఫిక్ నేమ్ ఏగిల్ మార్మెలోస్ (Aegle marmelos). ఈ పువ్వులు, బిళ్వ వృక్షం ఎక్కడబడితే అక్కడ కనిపించవు. చాలా అరుదుగా ఇవి ఉంటాయి. అందువల్ల మీరు శివుడికి ఇష్టమైన పూజ చెయ్యాలనుకుంటే... ముందు బిళ్వ వృక్ష ఆకులు, పువ్వులను సేకరించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఒకవేళ ఈ పూలు మీకు లభించకపోతే... కనీసం బిళ్వ ఆకులతోనైనా పూజ చేయవచ్చు. అవి అంటే కూడా స్వామికి విపరీతమైన ఇష్టం. ఈ రోజుల్లో ఆన్లైన్ ఈ కామర్స్ సైట్లలో ఈ ఆకులు లభిస్తున్నాయి. ఇవి ఎండినవి అయినా పర్లేదనీ, స్వామి కరుణిస్తారని పండితులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం) (Disclaimer: The information and information given in this article is based on general information. Telugu news18 does not confirm these. Contact the concerned specialist before implementing them.)