ఇంట్లో ఎప్పుడూ పసుపు, ఉప్పు అయిపోవడమనే ప్రసక్తి ఉండకూడదు. అయిపోయేంతవరకూ వాటిని వినియోగిస్తూ ఉండవద్దు. పసుపు, ఉప్పు ఇక అయిపోతున్నాయనుకుంటే.. కొంత స్టాక్ ఉండగానే.. కొత్త సరుకు తీసుకొచ్చి వాటికి జోడించాలి. ముఖ్యంగా ప్రతీ ఇంట్లో బియ్యం డబ్బాలో బియ్యం కొలిచే కొలపాత్ర ఉంటుంది. దాన్ని ఎప్పుడూ బోర్లించి ఉండకూడదని చెబుతున్నారు.
అలాగే విడిచిన దుస్తులు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు.. శుక్రవారం రోజు విడిచిన దుస్తులు ధరిస్తే దరిద్రం చుట్టుకుంటుంది అంటారు. అందుకే పాతదైనా.. ఉతికిన బట్టలే వేసుకోవాలని జ్యోతిష్య పండుతులు సూచిస్తున్నారు. అలాగే విడిచిన దుస్తులను తలుపు తగిలించకుండా వాషింగ్ మిషన్ లో వేయడం లేదా.. వాష్ చేయడం లాంటివి చేయాలి అంటున్నారు.
అలాగే శుక్రుడికి తెల్లని వస్త్రాలు ప్రీతిపాత్రమైనవి అని చెబుతారు. లక్ష్మీదేవికి కూడా తెల్లని వస్త్రాలు ప్రీతిపాత్రమైనవి. కాబట్టి తెల్లని దుస్తులు ధరిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం పొందుతారు. కుదిరితే తామరలు, పద్మములతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ దేవత అనుగ్రహం లభిస్తుందని సూచిస్తున్నారు. అలాగే, అన్నదానం, వస్త్రదానం, పుష్ప దానం చేసినా శుభ ఫలితాలు కలుగుతాయి.