నంబర్ 1 : నెలలోని 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్ 1 వస్తుంది. ఈ వారం కొంచెం కష్టంగా గడుస్తుంది. మిమ్మల్ని చాలా బిజీగా, విశ్రాంతి లేకుండా ఉంచుతుంది. డబ్బు నిర్వహణపై దృష్టి పెట్టాలి. దంపతులు ప్రయాణాలకు, చిన్న విషయాలపై వాదనలకు దూరంగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, మధ్యవర్తులతో కమ్యూనికేట్ చేయడంలో ఇబ్బంది ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది, మీ విజయానికి దోహదపడుతుంది. హార్డ్‌వేర్ ప్రొడక్ట్స్, సివిల్ కన్స్ట్రక్షన్లో పెట్టుబడులను ప్రోత్సహించాలని గుర్తుంచుకోండి. ఆభరణాలు, ఎగుమతి, సోలార్ ప్రొడక్ట్ డీలర్లు, గవర్నమెంట్ అసైన్మెంట్స్, మెడికల్ టీచింగ్, మీడియా పరిశ్రమ లాభాలు, బ్రాండ్ వాల్యూను పొందుతాయి.
మాస్టర్ కలర్: బ్లూ, బీజ్
లక్కీ డే: ఆదివారం
లక్కీ నంబర్: 1
దానాలు: పేదలకు లేదా పశువులకు అరటి పండ్లు దానం చేయాలి
నంబర్ 2 : నెలలోని 2, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్ 2 ప్రభావం ఉంటుంది. ఈ వారం స్లో, డల్ మూవ్‌మెంట్స్‌తో ఉంటుంది, కాబట్టి లాంగ్ టర్మ్ ప్లాన్స్‌ను నియంత్రించండి. సోమవారం నాడు శివునికి క్షీరాభిషేకం చేయండి. ఆశీర్వాదాలు పొందడానికి శుచిగా ఉండాలని గుర్తుంచుకోండి. లవ్ ఎమోషన్స్ మీ మనస్సును మారుస్తాయి. షేర్ చేసుకోవడం ఇప్పుడు ఔషధంలా పని చేస్తుంది. కుటుంబం, బంధువులకు డబ్బు, సమయాన్ని వెచ్చించండి, కుటుంబ కార్యక్రమాలకు హాజరవ్వండి, చిన్న ట్రిప్ ప్లాన్ చేయండి. స్టాక్‌లో పెట్టుబడి పెట్టండి. మీ భాగస్వామికి ఆశ్చర్యకరమైన బహుమతిని ఇవ్వండి.
మాస్టర్ కలర్: ఆక్వా
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్: 2
దానాలు: పేదలకు చక్కెర దానం చేయాలి
నంబర్ 3 : నెలలోని 3, 12, 21, 30వ తేదీలలో జన్మించిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్ 3 పని చేస్తుంది. ఈ వారం, నెలకు సంబంధించిన ప్లాన్, బడ్జెట్ సిద్ధం చేసుకోవాలి. విద్యార్థులు క్రమశిక్షణతో కొనసాగాలి, డిస్ట్రాక్షన్ పక్కన పెట్టాలి. వ్యక్తిగత జీవితంలో ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాబట్టి గతంలో జరిగిన అంశాలను మర్చిపోండి. ఇది ఆధ్యాత్మికతతో పాటు కుటుంబ బాధ్యతలకు సంబంధించిన వారం. పెద్ద బ్రాండ్లతో కలిసి పని చేయాలనుకుంటే డిసెంబర్ 5 లేదా 6వ తేదీలోపు వెళ్లవచ్చు. ముఖ్యంగా కన్సల్టెంట్లు, ఉపాధ్యాయులు, గాయకులు, కోచ్‌లు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, న్యాయవాదులకు అనుకూలంగా ఉంటుంది. వివాదాలను పరిష్కరించుకోవడానికి ఇది ఉత్తమ సమయం. పుస్తకాలు, డెకర్, ధాన్యాలు లేదా సంగీత వాయిద్యాల వ్యాపారం బాగా పెరుగుతుంది. సంగీతకారులు, హోటళ్లు, జాకీలు, లైఫ్ కోచ్‌లు, ఫైనాన్సర్లు, సంగీతకారులు లాభం, వృద్ధిని పొందుతారు.
మాస్టర్ కలర్: వయోలెట్
లక్కీ డే: గురువారం
లక్కీ నంబర్: 3
దానాలు: పశువులకు పచ్చి అరటి పండ్లు అందజేయాలి
నంబర్ 4 : నెలలోని 4, 13, 22, 31వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్ 4 ప్రభావం ఉంటుంది. మీరు ఈ వారం సద్వినియోగం చేసుకోవాలంటే, మొదట క్రమశిక్షణ, కో-ఆపరేషన్ కొనసాగించండి. లావాదేవీలు, ఆడిషన్, ఆడిటింగ్, ఉద్యోగ వేట, కమీషన్ లేదా మ్యారేజ్ ప్రపోజల్స్ వంటివి మీరు మనస్సు పెడితే నెరవేరుతాయి. మీరు మీ పిల్లలపై చాలా గర్వంగా ఉంటారు. వ్యవసాయం, వాణిజ్యపరమైన ఆస్తులపై పెట్టుబడి పెట్టే వారికి అనుకూలమైన సమయం. బ్యాంక్ ఉద్యోగులు, IT ఉద్యోగులు, ఆర్టిస్ట్ లేదా యాక్టర్లు, న్యూస్ యాంకర్లు, డ్యాన్సర్లు ఇన్వెస్ట్ చేయవచ్చు.. లాభాలు అందుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హార్డ్‌వేర్, కన్స్ట్రక్షన్ మెటీరియల్, మెటల్, బట్టల తయారీదారులు వ్యాపారంలో కొత్త ఆఫర్‌ను ఆశించాలి. దయచేసి తులసి మొక్కను ఇంట్లో పెట్టుకోండి, అన్ని రోజులూ నీరు పోయండి.
మాస్టర్ కలర్: బ్లూ
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్: 5, 6
దానాలు: స్నేహితుడికి తులసి మొక్క దానం చేయాలి
నంబర్ 5 : నెలలోని 5, 14, 23వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్ 5 పని చేస్తుంది. మీకు ఎక్కడ ఆగిపోయినట్లు అనిపించినా.. కళ్లు మూసుకొని ఏం కావాలో కోరుకోండి. అదృష్టం మీ దారిలోకి రావడం మీరు చూస్తారు. వినాయకుడికి పూజలు చేసి ఆయన ఆశీస్సులు తీసుకోండి. క్రీడాకారులు, మెడికల్ ప్రాక్టీషనర్లు ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేయగలరు. ఆర్థిక లాభాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎగుమతి దిగుమతులలో పెట్టుబడికి లాభాలు అందుకునే సూచనలు ఉన్నాయి. ఈరోజు మోడలింగ్, మెడికల్, స్పోర్ట్స్, ఈవెంట్స్, ఆడిషన్స్, ఇంటర్వ్యూలలో అదృష్టాన్ని ప్రయత్నించాలి.
మాస్టర్ కలర్: గ్రీన్
లక్కీ డే: బుధవారం
లక్కీ నంబర్: 5
దానాలు: జంతువులకు పాలు దానం చేయాలి
నంబర్ 6 : నెలలోని 6, 15, 24వ తేదీలలో నంబర్ 6 ప్రభావం కనిపిస్తుంది. లవ్ పార్ట్నర్, స్నేహితుడు, తల్లిదండ్రులు, పిల్లలు లేదా బంధువులతో వ్యక్తిగత సంబంధాలను ఆనందించే వారం. మీరు సేవా పరిశ్రమలో ఉంటే, మీరు అదృష్టాన్ని, స్థిరత్వాన్ని కూడా ఆనందిస్తారు. మీరు దీన్ని సాధించడానికి చాలా కష్టపడి పనిచేశారు కాబట్టి, మీ ప్రయత్నాలకు గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభను ప్రదర్శించడానికి మాస్ కమ్యూనికేషన్ బెస్ట్ ఆప్షన్. అవకాశాలు అందుకోవడానికి సమయం పడుతుంది. కుటుంబ ఆనందాన్ని, జీవితానికి సంపూర్ణతను తెచ్చే సౌకర్యవంతమైన వారం. మ్యారేజ్ ప్రపోజల్స్ ఇప్పుడు చాలా అనుకూలంగా ఉంటాయి, వాటి గురించి సీరియస్‌గా ఆలోచించాలి. బిజినెస్ క్లయింట్ల సమస్యలను పరిష్కరించే సమయం. విందు లేదా షాపింగ్ కోసం బయటకు వెళ్లేందుకు అనుకూలం. గృహిణులు, క్రీడాకారిణి, ప్రాపర్టీ డీలర్లు, చర్మవ్యాధి నిపుణులు గాయకులు, డిజైనర్లు, ఈవెంట్ మేనేజ్మెంట్, బ్రోకర్లు, చెఫ్‌లు, విద్యార్ధులు విజయాలను అందుకుంటారు.
మాస్టర్ కలర్: పింక్, గ్రే
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్: 6
దానాలు: పేదలకు వస్త్రాలు దానం చేయాలి
నంబర్ 7 : నెలలోని 7, 16, 25వ తేదీలలో జన్మించిన వారిపై 7వ నంబర్ ప్రభావం ఉంటుంది. ఈ వారంలోనే కేతు పూజ చేయండి. గౌరవనీయమైన గ్రహం స్వచ్ఛమైన శక్తిని పొందండి. మీరు చాలా బిజీగా ఉంటారు. రోజువారీ స్నేహితులతో గడపడం చాలా తక్కువ. రాజకీయ నాయకులు వినూత్న ఆలోచనలకు వెళ్లేందుకు అనుకూలమైన, ఉత్తేజకరమైన సమయం. ఎల్లప్పుడూ ఫాబ్రిక్ లేదా లెదర్ ప్రొడక్టులకు బదులుగా మెటల్ ఉపయోగించండి. మీరు ఎల్లప్పుడూ శివుని ఆశీస్సులు తీసుకోవాలి. ప్రస్తుతానికి ప్రధాన నిర్ణయాలను పెండింగ్‌లో ఉంచాలి. తల్లి సలహాలను శ్రద్ధగా వినండి. ప్రయాణాలకు దూరంగా ఉండండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం మంచిది. డిఫెన్స్‌లో ఉన్న వ్యక్తులు, న్యాయవాదులు, శాస్త్రవేత్తలు, పైలట్లు, రాజకీయ నాయకులు, థియేటర్ ఆర్టిస్ట్, CA, మీడియా యువకులు ప్రత్యేక అదృష్టాన్ని పొందుతారు.
మాస్టర్ కలర్: ఆరెంజ్
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్: 7, 9
దానాలు: ఆలయానికి కుంకుమ దానం చేయాలి
నంబర్ 8 : నెలలోని 8, 17, 26వ తేదీలలో జన్మించిన వ్యక్తులపై న్యూమరాలజీ ప్రకారం 8వ నంబర్ ప్రభావం కనిపిస్తుంది. రోజంతా ఎనర్జీతో ఉండటానికి, నిద్రలేచిన వెంటనే మీ దుప్పటిని మడతపెట్టే పనిని అలవాటు చేసుకోండి. డిస్ట్రిబ్యూషన్, దానంతో వారాన్ని ప్రారంభించండి. హై పవర్ పొజిషన్‌ను అందుకోవడానికి ఫ్లెక్సిబుల్‌గా మారాలి. ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఆస్తి, యంత్రాల కొనుగోలుకు సంబంధించిన నిర్ణయాలు మీకు అనుకూలంగా మారుతాయి. అయినప్పటికీ ఈ వారం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వైద్యులు, తయారీదారులు విజయాలను గౌరవంగా భావిస్తారు. పిల్లలకు మీ మార్గదర్శకత్వం అవసరం కాబట్టి వారితో సమయం గడపండి. ధాన్యాలు దానం చేయడం, పుల్లని పదార్థాలు తినడం ఈరోజు తప్పనిసరి.
మాస్టర్ కలర్: పర్పుల్
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్: 6
దానాలు: అవసరమైన వారికి వస్త్రాలు దానం చేయాలి
నంబర్ 9 : నెలలోని 9, 18, 27వ తేదీలలో పుట్టిన వారిపై 9వ సంఖ్య ప్రభావం చూపిస్తుంది. కొత్త ఆఫర్లను పెండింగ్‌లో ఉంచాలి. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. సోమరితనానికి దారి తీస్తుంది కాబట్టి లగ్జరీని పక్కన పెట్టాలి. ఓవర్సీస్ అండ్ ట్రైనింగ్ బిజినెస్ బావుంటుంది. జంటలు చాలా కమిట్మెంట్స్తో సంతోషంగా, రొమాంటిక్‌గా ఉంటారు. ప్రేమలో ఉన్నవారు తమ ఫీలింగ్స్‌ను తెలియజేయడానికి ఒక అద్భుతమైన సమయం . వ్యాపార సంబంధాలు, ఒప్పందాలు కార్యరూపం దాల్చడానికి మరింత సమయం కావాలి. మెటల్ ఇండస్ట్రీ, మీడియాలోని వ్యక్తులు పురోగతిని ఆనందిస్తారు. రాజకీయ నాయకులు గొప్ప అవకాశాలను అందుకుంటారు. క్రీడాకారులు, విద్యార్థులు సహకరించడానికి, పురోగతిని సాధించడానికి ఈ రోజును తప్పక ఉపయోగించుకోవాలి. విద్యార్థులు, శిక్షకులు, సంగీతకారులు, రచయిత, డిజైనర్లు, వైద్యులు, న్యాయవాదులు, ఇంజనీర్లు, యాక్టర్లు పాపులారిటీ పొందుతారు.
మాస్టర్ కలర్: బ్రౌన్
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్: 9
దానాలు: ఆశ్రమాలకు, అనాథాశ్రమాలకు గోధుమలు ఇవ్వాలి