మనిషి సౌకర్యవంతంగా జీవించడానికి కొన్ని సొంత అలవాట్లు, అభిరుచులతో పాటు ఆమోదయోగ్యమైన వ్యసనాలు కూడా ఉండాలి. సౌలభ్యానికి అనుగుణంగా ప్రతి ఒక్కరికీ విభిన్న అభిరుచులు ఉంటాయి. ఈ అభిరుచి మోతాదు దాటితేనే వ్యసనంగా మారుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం 12 రాశుల్లో ఏయే రాశి వారికి ఏ వ్యసనం ఉంటుందో చూద్దాం.
* మేషం.. ఈ రాశి వారికి టీవీ షోలు చూడటం అంటే విపరీతమైన ఇష్టం. రిస్కులు తీసుకోవడం, సవాళ్లను స్వీకరించడాన్ని వీరు ఎక్కువగా ఇష్టపడతారు.
2/ 12
* వృషభం.. వృషభ రాశి వారికి పూలంటే అమితమైన ఇష్టం. అంతేకాకుండా వీరికి మసాజులు, స్పా సెంటర్లలో సమయాన్ని గడపడాన్ని ఎంజాయ్ చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే లగ్జరీని ఎక్కువగా ఇష్టపడతారు.
3/ 12
* మిథునం.. ఈ రాశి వారు సోషల్ మీడియాకు బానిసలు. ఎప్పుడూ ఇంటర్నెట్లో ఏదోకటి శోధిస్తూనే ఉంటారు.
4/ 12
* కర్కాటకం.. కర్కాటక రాశి వారు సినిమా ప్రియులు. వరుస పెట్టి ఎక్కువగా మూవీస్ చూస్తుంటారు. అంతేకాకుండా తమకు సరిపోని వ్యక్తులను ఇష్టపడతారు. విడిపోయినా కలిసేందుకు కష్టపడుతుంటారు.
5/ 12
* సింహం.. ఈ రాశి వారు ఫ్యాషన్ ప్రియులు. ట్రెండీగా కనిపించాలని, ప్రతి ఒక్కరి చూపు తమపైనే ఉండాలని ఆశపడుతుంటారు. అందుకోసం తగిన ప్రయత్నాలు చేస్తారు.
6/ 12
* కన్య.. కన్యా రాశికి చెందినవారు టీ తాగడం, పుస్తకాలు చదవడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రెండింటి కాంబినేషన్ ఎప్పుడూ కావాలనుకుంటారు.
7/ 12
* తుల.. ఈ రాశి వారు ఫోన్‌కు అడిక్ట్ అవుతారు. ఎంతలా అంటే చుట్టుపక్కల వారు కూడా వీరిని చూసి చికాకు పడేంతగా మొబైల్‌కు బానిసలవుతారు.
8/ 12
* వృశ్చికం.. ఈ రాశి వారు ఆల్కహాల్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. అంతేకాకుండా వీరు రొమాంటిక్ ప్రియులు. తమ భాగస్వామితో సన్నిహితంగా గడిపేందుకు ఆశపడుతుంటారు.
9/ 12
* ధనస్సు.. ధనస్సు రాశి ప్రజలు అడ్వెంచర్స్‌ను ఇష్టపడతారు. ట్రావెలింగ్ చేయడం, రిస్క్ తీసుకోవడం చేస్తారు. కళలకు అడిక్ట్ అవుతారు. రోడ్ ట్రిప్స్ కోసం ప్లాన్ చేస్తారు.
10/ 12
* మకరం.. మకర రాశి వారు మంచం ప్రియులు. ఏ మాత్రం ఖాళీ దొరికినా మంచంపై చేరి మత్తుగా నిద్రపోతారు. తిండి, చదువు, వర్కౌట్లు ప్రతిదీ మంచంపై నుంచే చేస్తారు. వీరికి రచన అంటే కూడా అమితమైన ఇష్టం ఉంటుంది.
11/ 12
* కుంభం.. కుంభ రాశి వారికి కుక్క పిల్లలంటే అమితమైన ఇష్టం. శునకాలకు సంబంధించి పెద్ద కలెక్షనే చేస్తారు.
12/ 12
* మీనం.. మీన రాశి ప్రజలు మిరుమిట్లు గొలిపే లైట్లను ఇష్టపడతారు. వీరు నిద్ర పోవడాన్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. వీరు ఏ సమయంలోనైనా సులభంగా నిద్రిస్తారు. అంతేకాకుండా వీరికి ఎన్నో వ్యసనాలు ఉన్నాయి. అది మద్యం కావచ్చు, ఆహారం కావచ్చు.