డ్రీమ్‌లో రెండు రకాలు ఉంటాయంటున్నారు నిద్ర నిపుణులు. గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా వచ్చేవి ఒకరకమైన కలలైతే... భవిష్యత్తులో జరగబోయే అంశాలపై వచ్చేవి రెండో రకమైన కలలట. ఐతే... ఎవరికైనా కలలో... మహాదేవుడు శివుడు కనిపిస్తే... దాని వల్ల కలగబోయే ప్రయోజనాలు ఏంటన్న దానిపై నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
మీకు కలలో పార్వతీ పరమేశ్వరులు కనిపిస్తే, మీకు అర్థనాధీశ్వరుల ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయని అర్థం. మీ వైవాహిక జీవితంలో ఉండే అసమ్మతికి, మనస్పర్దలకు ముగింపు పలకబోతున్నారని అర్థం. అయితే ఇలాంటి కల వచ్చినప్పుడు మీరు పార్వతీ పరమేశ్వరులకు జలాభిషేకం చేస్తే శుభ ఫలితాలొస్తాయి. ఆ తర్వాత శివాలయంలో తేనే సమర్పించి సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ప్రార్థించాలి.
స్వప్నశాస్త్రం ప్రకారం, మీకు కలలో ఈశ్వరుడు తాండవం చేస్తున్నట్లు కనిపిస్తే, మీపై పరమేశ్వరుడు ఆగ్రహంతో ఉన్నారని లేదా మీకు జీవితంలో భవిష్యత్తులో అనేక కష్టాలు ఎదురుకానున్నాయని మాత్రం భయపడాల్సిన పని లేదు. మీకు నిజ జీవితంలో శత్రువులు బాధ ఎక్కువైనప్పుడు ఇలాంటి శివుని రూపాన్ని చూస్తారు. అంటే శివయ్య తన భక్తులకు శత్రువుల నుంచి త్వరలోనే విముక్తి ప్రసాదిస్తాడని అర్థం.