చకోర్ పక్షి : స్వప్న శాస్త్రం ప్రకారం, కొన్ని పక్షులను కలలో చూడటం శుభప్రదం. ఈ పక్షులలో చకోర్ పక్షి ఒకటి. కలలో చకోర్ పక్షిని చూడటం రాబోయే కాలంలో అపారమైన సంపదను సూచిస్తుందని నమ్ముతారు. దీన్ని చూస్తే అదృష్ట తాళాలు తెరుచుకున్నట్లేనంట. నమ్మకాల ప్రకారం, తన కలలో చకోర్ పక్షిని చూసే వ్యక్తికి మంచి జీవిత భాగస్వామితో పాటు చాలా సంపద కూడా లభిస్తుంది.