Ayodhya Virtual Deepotsav 2020: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం అయోధ్యంలో భారీ దీపోత్సవం నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం 5 లక్షల 51 వేల ప్రమిదలను వెలిగించారు. దీంతో అయోధ్య ఆలయం దేదీప్యామానంగా వెలిగిపోతోంది. రామ జన్మ భూమిలో రామాలయ నిర్మాణం ప్రారంభించాక జరుగుతున్న తొలి దీపోత్సవం ఇది. అందువల్ల ప్రపంచం నలుమూలల్లో ఉన్న వారంతా ఇందులో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం... ఓ వెబ్సైట్ రూపొందించింది. ఇందులో వర్చువల్ రూపంలో ఎవరైనా సరే దీపం వెలిగించవచ్చు.
ఇప్పుడు ఎడమవైపు మూడు రకాల ప్రమిదలు వస్తాయి. అవి మట్టి ప్రమిద, రాగి ప్రమిద, ఇత్తడి ప్రమిద. మీకు నచ్చిన ప్రమిదపై క్లిక్ చెయ్యండి. ఇప్పుడు... మధ్యలో ఆవ నూనె, నెయ్యి, నువ్వుల నూనె ఉంటాయి. వాటిలో మీకు నచ్చినది క్లిక్ చెయ్యండి. ఇప్పుడు మూడు రకాల చేతులొస్తాయి. పురుష చెయ్యి, మహిళ చెయ్యి, ఇతర చెయ్యి వస్తాయి. మీకు సంబంధించిన చెయ్యిని క్లిక్ చెయ్యండి.