Name Astrology: చిన్న పిల్లలను చూస్తే చాలా ముద్దు వేస్తుంది. ఇక వారు చేసే అల్లరి అన్నారు.. వారి ముద్దుముద్దు మాటలు అయితే మరింత ఆనందాన్ని ఇస్తాయి. ఇక కాస్త చురుకుగా.. తెలివిగా ఉంటే.. ఆ పిల్లల్ని వదలాలి అనిపించదు. వారితో ఎంత సమయం గడిపినా తెలియకుండానే గడిచిపోతుంది. అయితే అలా తెలివైన వారికి పేరు పెట్టడంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే.. వారి మెదడు కంప్యూటర్ కంటే వేగంగా పని చే్స్తుంది అంట..?
కొందరైతే... పేర్ల బుక్స్ కొంటారు. ఇంకొందరు గూగుల్లో సెర్చ్ చేస్తారు. ఈ పేర్లకు సంబంధించి కొన్ని వందల వెబ్సైట్లు కూడా ఉన్నాయి. అవన్నీ రకరకాల పేర్లు సూచిస్తున్నాయి. ఐతే... పేరు పెట్టేందుకు ఏయే విషయాలు ఆలోచించుకోవాలో ఓసారి తెలుసుకుందాం. ముఖ్యంగా చాలామంది జ్యోతిష్య శాస్త్రం, లేదా న్యూమరాలజీని నమ్ముతూ ఉంటారు.
ముఖ్యంగా పేరుకు రాశిచక్ర గుర్తులు, గ్రహాలతో లోతైన సంబంధం ఉంటుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. చాలా మంది వ్యక్తులు వారి జన్మ రాశిని బట్టి పేర్లు పెట్టుకుంటారు. జన్మరాశిని బట్టి పెట్టే పేర్లు మరింత ప్రభావవంతంగా ఉంటాయని చెబుతారు. అయితే కొన్ని అక్షరాలతో పిల్లలకు పేర్లు పెట్టినట్టైతే.. ఆ పిల్లల మెదడు కంప్యూటర్ (Computer) కంటే వేగంగా పరిగెడుతుంది అంటున్నారు.
అక్షరం K: ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే పిల్లలు చాలా తెలివైనవారు అవుతారంట. అలాగే కష్టపడి పనిచేస్తారని చెబుతున్నారు. తమ తెలివితేటలతో ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. వీరి జీవితంలో సౌకర్యాలకు కొదవ ఉండదు. ఒక సారి ఆ పని చేయాలనుకుంటే అది పూర్తి చేసే వరకు వదిలిపెట్టరంట. అలాగే వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుందంటున్నారు. సమాజంలో వీరికి భిన్నమైన గుర్తింపు లభిస్తుంది.
అక్షరం L: ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తుల మనస్సు చాలా వేగంగా పరుగెడుతుందంటున్నారు. దీనికి కారణం కూడా ఉందని చెబుతున్నారు. ఎల్ అక్షరంతో పేరు ఉన్నవారు చిన్న వయస్సులోనే విజయం సాధిస్తారంటున్నారు. సమాజంలో వారికి భిన్నమైన గుర్తింపు ఉంటుంది ఉంది. ఒక్కసారి ఏదైనా చేయాలని అనుకుంటే అది సాధించిన తర్వాతే ఊపిరి పీల్చుకుంటారు.