దీపావళి రోజు చేయకూడని పనులు..
పరిశుభ్రత: సాధారణంగా సాయంత్రం పూట లక్ష్మీపూజ చేస్తారు. ఈ సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటిని శుభ్రం చేయడానికి వెళ్లకండి. లక్ష్మీ పూజ రోజున ఉదయం ఇంటిని శుభ్రం చేయండి. మురికి ప్రదేశంలో లక్ష్మి నివసించదు. కాబట్టి ఇంట్లోని ప్రతి మూలను శుభ్రం చేయడం మర్చిపోవద్దు. వస్తువులను చెల్లాచెదురుగా ఉంచవద్దు.
లక్ష్మీ పూజ సమయంలో మీరు ఆహారం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ సమయంలో మాంసాహారం (నాన్ వెజ్), ఆల్కహాల్ ఏ కారణం చేతనూ తీసుకోవద్దు. ఉపవాసం ఉండే వారు ఉల్లిపాయలు, వెల్లుల్లి తినకూడదు. వీలైనంత వరకు బయటి చిరుతిళ్లు తినవద్దు. అలాగే ఆమె పూజ చేసినప్పుడు మన బట్టలు కూడా ముఖ్యమైనవి. లక్ష్మీపూజ చేసేటప్పుడు చిరిగిన బట్టలు ధరించవద్దు. చిరిగిన బట్టలు పేదరికానికి సంకేతం. ఈ సందర్భంగా నల్లని దుస్తులు కూడా ధరించకూడదు అంటున్నారు పండితులు.