Dhanteras: ఈ రాశుల వారు కుంకుమ కొంటే..ధనలక్ష్మీ తలుపు తట్టినట్లే.. డబ్బే డబ్బు
Dhanteras: ఈ రాశుల వారు కుంకుమ కొంటే..ధనలక్ష్మీ తలుపు తట్టినట్లే.. డబ్బే డబ్బు
Dhanteras: ధన త్రయోదశి రోజున బంగారం, వెండి కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని మనలో చాలా మంది విశ్వసిస్తారు. ఐతే ఇవి మాత్రమే కాదు.. ఇతర వస్తువులను కొన్నా శుభప్రదంగా ఉంటుంది. ధన్తేరస్ రోజున ఏ రాశి వారు ఎలాంటి వస్తువులను కొనాలో ఇక్కడ తెలుసుకుందాం.
హిందూ విశ్వాసాల ప్రకారం.. ధన్ తేరస్ పండగ ఎంతో శుభప్రదమైనది. ఆ రోజున ధన్వంతరి, లక్ష్మీదేవిని సంపద, శ్రేయస్సు కలుగుతాయని విశ్వసిస్తారు. ఈ సంవత్సరం ధన్ తేరస్ అక్టోబర్ 23న వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 15
ధన్తేరస్ రోజున బంగారం, వెండి నగలను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఐతే మీ రాశిని బట్టి ఎవరు ఎలాంటి వస్తువులను కొనుగోలు చేస్తే లక్ష్మీ దేవత అనుగ్రహం పొందవచ్చో ఇక్కడ తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 15
మేష రాశి (Aries): మేష రాశి వారు ధన్ తేరస్ సమయంలో వజ్రాభరణాలు, బంగారు మరియు వెండి నాణేలు, పాత్రలను కొనుగోలు చేయాలి. అంతేగానీ రసాయనాలు, ఇనుము, తోలు వంటి వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 15
వృషభ రాశి (Taurus): వృషభ రాశివారు వజ్రాలు, బంగారం, వెండితో పాటు కాంస్య పాత్రలను కొనుగోలు చేయవచ్చు. గంధం, కుంకుమ కూడా కొనుగోలు కొన్నా అదృష్టం కలుగుతుంది. తోలు, నూనె, కలప, వాహనాలకు కొనుగోలుకు దూరంగా ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 15
మిథున రాశి (Gemini): మిథునరాశి వారికి ధన్తేరస్ చాలా శుభప్రదం. పుఖ్రాజ్, బంగారం , వెండిని కొంటే ఎంతో మంచి జరుగుతుంది. వీటితో పాటు ఇల్లు, భూమి, ఫర్నిచర్ వంటి ఆస్తికి సంబంధించిన కొనుగోళ్లు చేసినా లక్ష్మీ కటాక్షం మీపై ఉటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 15
కర్కాటక రాశి (Cancer): కర్కాటక రాశి వారు ఈ సమయంలో వస్తువులను.. వారి స్వంత పేరుతో కాకుండా.. కుటుంబం పేరుతో కొనుగోలు చేయాలి. మీ పిల్లలకు ఏదైనా కొత్తగా కొనాలనుకుంటే.. అందుకు ఇదే మంచి సమయం. ఐతే వీరు ధన్తేరస్ రోజున బంగారం కొనొద్దు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవద్దు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 15
సింహ రాశి (Leo): సింహం వాహనాలు, చెక్కతో చేసిన పాత్రలు, ఎలక్ట్రానిక్స్, బంగారం, వెండి ఆభరణాలు, కాంస్య వస్తవులు, ఇల్లు, భూమి కొనుగోలు చేయవచ్చు. సిమెంట్, ఇనుముతో చేసిన వస్తువులను కొనుగోలు చేయకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 15
కన్య రాశి (Virgo): కన్యారాశి వారు ధన్తేరస్ రోజున భూమి, గాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయవచ్చు. అంతేగానీ బంగారం, వెండి, వజ్రాలు కొనకూడదు. ఆ రోజు మీరు కొత్త తెల్లని బట్టలు ధరించడం మానుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 15
తుల రాశి (Libra): తులా రాశివారుపెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నా? బంగారం లేదా వజ్రాలు కొనుగోలు చేయలనుకుంటున్నా? వెంటనే ఆ నిర్ణయం తీసుకోవద్దు. కాస్త వేచి చూడాలి. మీ కుటుంబ సభ్యుడు కాని వ్యక్తి పేరు మీద వీటిని కొనుగోలు చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 15
వృశ్చిక రాశి (Scorpio): వృశ్చిక రాశి వారు బంగారం, వెండి, మట్టిపాత్రలు, బట్టలు, ఇనుముతో చేసిన వస్తువులను కొనుగోలు చేయాలి. అయితే బ్రాండెడ్ వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టుకపోవడమే మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)
11/ 15
ధనస్సు రాశి (Sagittarius): ధనుస్సు రాశి వారికి ఈ పండుగ చాలా శుభప్రదమైనది. ఈ సమయంలో మీరు భూమి, విలువైన లోహాలు, రాళ్ళు, వజ్రాలను కొనుగోలు చేయవచ్చు. ఏం కొన్నా.. అది మీకు అదృష్టాన్ని తీసుకొస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
12/ 15
మకర రాశి (Capricorn): ఈ పండుగ సమయంలో మీరు ఏ వస్తువు కొనుగోలు చేసినా ప్రయోజనం ఉంటుంది. భూమి, లోహాలు, పాత్రలు, బట్టలు కొనుగోలు చేస్తే లక్ష్మీ దేవి ఆశీస్సులు లభిస్తాయి. పూర్వీకుల వస్తువులు కూడా మీకు శుభప్రదంగా ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
13/ 15
కుంభ రాశి (Aquarius): కుంభ రాశిలో జన్మించిన వారు పుస్తకాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహాలంకరణ, ఫర్నిచర్ కొనుగోలు చేయవచ్చు. పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. ఐతే ఈ సమయంలో స్థిర ఆస్తులను మాత్రం కొనుగోలు చేయవద్దు. (ప్రతీకాత్మక చిత్రం)
14/ 15
మీన రాశి (Pisces): మీనరాశి వారు బంగారం, వెండి, విలువైన రాళ్లు, లోహ వస్తువులను కొనుగోలు చేయవచ్చు. షేర్ ఇన్వెస్ట్మెంట్ తప్ప.. తమకు నచ్చిన ఏ ఇతర వస్తువులనైనా కొనవచ్చు. కానీ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే.. నష్టాలు వచ్చే అవకాశముంది. (ప్రతీకాత్మక చిత్రం)
15/ 15
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)(ప్రతీకాత్మక చిత్రం)