ధంతేరస్ లేదా ధనత్రయోదశి పండుగను అక్టోబర్ 22 శనివారం జరుపుకుంటారు. ధన్‌తేరాస్ పండుగ రోజున ప్రజలు మార్కెట్‌లో విపరీతంగా షాపింగ్ చేస్తారు. ఈ పండుగలో కొత్త వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదమని, ముఖ్యంగా చీపురు, పాత్రలు, కొత్తిమీర, బంగారు, వెండి వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదమని నమ్ముతారు అయితే ఈ రోజున మీ రాశి ప్రకారం వస్తువులు కొనడం మరింత శుభప్రదమని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. రాశిచక్రం ప్రకారం వస్తువును కొనుగోలు చేయడం ద్వారా లక్ష్మీదేవి, కుబేరుడు, ధన్వంతరి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. ధంతేరస్ రోజున మీ రాశిచక్రం ప్రకారం మీకు ఏది శుభప్రదంగా ఉంటుందో తెలుసుకోండి.