మేషం (Aries): డిసెంబర్ నెల మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది . మీ జాతకంలో సూర్య భగవానుడి స్థానం చాలా బలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో విజయాన్ని అందుకుంటారు. లాభాలు వస్తాయి. అదృష్టం కలిసి వచ్చి.. పట్టిందల్లా బంగారమే అవుతుంది. కెరీర్లో కొన్ని కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం (Cancer): వచ్చే నెల కర్కాటక రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. సూర్యుడి సంచారం మీకు బాగా కలిసి వస్తుంది. భౌతిక ఆనందాన్ని పొందవచ్చు. ఈ సమయంలో వాహనం, స్థలాన్ని కొనుగోలు చేసే అవకాశముంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయాల్లో చురుగ్గా ఉండే వారికి కొత్త పదవి దక్కవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
తుల (Libra): వచ్చేనెలలో తుల రాశి వారు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపారం చేసే వారికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. శుక్రుని ప్రభావం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపార నిమిత్త వేరే ప్రాంతాలకు ప్రయాణించాల్సి రావచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)