జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు కోపాన్ని నియంత్రించుకోలేరు. అప్పటి దాకా ప్రశాంతంగా ఉన్న వారు ఒక్కసారిగా నరసింహ వతారం ఎత్తేస్తారు. సినిమాటిక్ గా చెప్పాలంటే అర్జున్ రెడ్డిలాగా మారిపోతారు. ఆ క్షణంలో వారు ఏం చేస్తారో వారికే తెలీదు. ఇప్పుడు ఆ రాశులు ఏంటో ఒకసారి చూద్దాం (ప్రతీకాత్మక చిత్రం)
చిన్న చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకోవడం మేషరాశి వారి సహజ గుణం. వీరి కోపం అంత త్వరగా తగ్గిపోదు. పదే పదే తమకు కోపం తెప్పించే విషయాలను తలచుకుంటూ ఆవేశంతో ఇంకా ఊగిపోతారు. ఏ విషయాన్ని వీరు అంత త్వరగా మరిచిపోరు.. అదే సమయంలో తమను ఆగ్రహానికి గురి చేసిన వారిపై పగ తీర్చుకోకుండా ఉండరు. (ప్రతీకాత్మక చిత్రం)