[caption id="attachment_1136754" align="alignnone" width="1200"] వృషభ రాశి వారు ఈ జాబితాలో ముందుంటారు. ఈ రాశివారికి పుట్టుకతోనే కష్టపడే తత్వం అలవడి ఉంటుంది. అదే సమయంలో వీరికి ఏదీ కూడా అంత సులభంగా దొరకదు. ప్రతి దానికి కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఫలితంగా లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో వీరికి ఎన్ని కష్టాలు ఎదురైనా.. తమ పనిని మాత్రం ఆపరు. (ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చిక రాశి వారిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. మిగతా రాశుల వారిలా కాకుండా ఈ రాశుల వారు తమ జీవితంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాలను నిర్దేశించుకుని ఉంటారు. వీరికి సమస్యలను ఎదుర్కొవడం అంటే వీరికి చాలా సరదా. వీరు తమ లక్ష్యానికి చేరుకోవడంతో ఆగిపోరు. తమకు నచ్చిన వారి లక్ష్యాలను సాధించడంలో సాయం చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
నెవర్ గివప్ అనే పదానికి కన్య రాశి వారు మంచి ఉదాహరణ. వీరు తమ లక్ష్యాన్ని మొదటి ప్రయత్నంలోనే చేరుకోలేరు. ఓటమి ఎదురైనా.. ఇంకోసారి ప్రయత్నిద్దాం అంటూ తమ టార్గెట్ ను చేరుకునే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. వీరు ప్రతి సమస్యను ఒక పజిల్ లా భావిస్తూ దానికి సమాధానాన్ని కనిపెడుతూ ముందుకు వెళ్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటక రాశి వారికి తపన అనేది ఎక్కువగా ఉంటుంది. తమ కలలను సాకారం చేసుకునే క్రమంలో వీరికి లక్ కూడా కలిసి వస్తోంది. ఉదాహరణకు వీరు తమ ఇంటికి సైకిల్ పై వెళ్తున్నారనుకోండి. మార్గం మధ్యలో వీరు అలసిపోతారు. ఇక సైకిల్ తొక్కడం తన వల్ల కాదనుకునే సమయంలో.. వీరికి స్లోప్ కనిపిస్తుంది. అంతే తొక్కకుండా కూడా సైకిల్ రయ్ మని దూసుకెళ్తోంది. అదే విధంగా వీరు తమ లక్ష్యాలను చేరుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)