ఆందోళన, ఒత్తిడి విషయాల్లో మిధున రాశి వారిది విచిత్ర పరిస్థితి. వాస్తవానికి వీరు చాలా సరదాగా ఉంటారు. అందరితోనూ కలివిడిగా ఉండే స్వభావం వీరిది. అయితే వీరు అతిగా ఆలోచిస్తుంటారు. అదే వీరిని ఆందోళనకు గురి చేస్తుంది. ఈ రోజు కంటే రేపు ఇంకా బెటర్ గా చేయాలనే తపన వీరికి తెలియకుండా వీరిని ఒత్తిడిలోకి నెడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
మీన రాశి వారికి తమ గురించి కంటే కూడా ఎదుటి వారి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వారు తన గురించి అలా అనుకుంటున్నారు.. ఇలా అనుకుంటున్నారన్న ధ్యాసే వీరిని ఒత్తిడిలోకి నెట్టేస్తూ ఉంటుంది. ఆ పని చేస్తే వీరు తన గురించి ఏమనుకుంటారో అన్న కోణంలో ఆలోచిస్తూ లేనిపోని వాటికి ఎక్కువగా ఆందోళన చెందడం ఈ రాశివారి నైజం. (ప్రతీకాత్మక చిత్రం)