మనకు మనసు బాలేనప్పుడు ఏ గుడికో, చర్చికో, మసీదుకో... మరేదైనా ప్రార్థనా స్థలానికి వెళ్తుంటాం. ఎందుకంటే... అక్కడ లభించే ప్రశాంతత, మానసిక సంతృప్తి మిగతా చోట్ల లభించవు అంటారు చాలా మంది. మరి మనం నివసించే ఇంట్లో ప్రశాంతత, ఆనందం, సంతోషం, అష్టైశ్వర్యాభివృద్ధి కావాలంటే... పూజ గది అత్యంత ముఖ్యమైనది. పూజ గదిని ఎలా నిర్మించారు... ఏ రంగు పెయింట్ వేశారన్నదాన్ని బట్టీ... తగిన ఫలాలు దక్కుతాయని వాస్తుశాస్త్ర పండితులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)