Navratri 2020: దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లోని పుణ్య క్షేత్రాలు, శక్తి పీఠాలకు భక్తులు పోటెత్తుతున్నారు. వాటిలో ఉనా జిల్లాలో ఉన్న ప్రముఖ చింతపూర్ణి ఆలయం ప్రత్యేకమైనది. ఈ ఆలయంలో పూర్వం అమ్మవారు ఏడ్చినట్లు శబ్దాలు వినిపించేవి. ఇప్పుడు భక్తుల దేవి నామస్మరణలు మళ్లీ మళ్లీ ప్రతిధ్వనిస్తున్నాయి. ఒక్కసారి అమ్మను స్మరించినా చాలు... చాలాసార్లు ఆ మాట వినిపిస్తూనే ఉంటుంది.
ఆలయ నిర్వాహకులు... కరోనా రూల్స్ బాగా అమలయ్యేలా చేయడానికి ప్రయత్నిస్తున్నా... అంతగా వీలు కావట్లేదు. అక్కడికీ ఆలయంలోపల, బయట ఎటు చూసినా సీసీ కెమెరాలే కనిపించేలా బోలెడన్ని ఏర్పాటుచేశారు. అయినా భక్తులు సేప్ డిస్టాన్స్ పాటించడం వీలు కావట్లేదు. ప్రస్తుతం ఈలయ పరిసరాల్ని కంటోన్మెంట్ గా మార్చారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటుచేశారు.