ఆచార్య చాణక్య (Aacharya chanakya) గొప్ప పండితుడు. చంద్రగుప్త మౌర్యుడిని రాజుగా చేయడంలో ఆచార్య చాణక్యుడు కీలకపాత్ర పోషించాడు. ఆచార్య చాణక్య (Chanakya Niti) విధానాలను అనుసరించే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ విఫలం కాలేదు. నేటికీ, ఆచార్య చాణక్యుడి విధానాలు ప్రభావవంతంగా ఉన్నాయి.ఈ విధానాలను అర్థం చేసుకుని జీవితంలో అనుసరించే వ్యక్తికి చాలా బాధలు సులభంగా దూరమవుతాయని అంటారు. అలాంటి చాణక్య నీతి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం.
సంభాషణ : మీ సంభాషణ అనేది చాలా మధురంగా ఉండాలి. మీ మాటలతో ఎదుటివారిని నొప్పించకూడదు. పెద్దవారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. ముఖ్యంగా సమాజంలో పేరు ప్రతిష్ట ఉన్నవారితో గొడవలు మంచివి కాదని చెప్పాడు. ఏదైనా మీ మాటల వల్ల వాళ్లు బాధపడితే.. భవిష్యత్తులో మీకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని చాణక్యుడు హెచ్చరించాడు.