కొన్నాళ్ల తర్వాత ఇలా ఒకరినొకరు తెలుసుకొని.. చిన్న చిన్న విషయాలకు ఇబ్బందులు, కోపాలు తెచ్చుకోకుండా మెలిగితేనే వారి వైవాహిక జీవితం సంతోషంగా సాఫీగా సాగిపోతుంది అని.. చాణక్యుడు చాణక్య నీతిలో చెప్పాడు. పెళ్లి తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దంటే.. పెళ్లికి ముందు జీవిత భాగస్వామి గురించి తెలుసుకోవాల్సిన విషయాలను వివరించాడు. అవేంటంటే.. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రేమ వివాహం చేసుకుంటే.. లవ్ చేసుకుంటున్న సమయంలోనే ఒకరినొకరు తెలుసుకుంటారు. అయితే ఒకవేళ పెద్దలు కుదిర్చిన పెళ్లి అయితే అలాంటి అవకాశం ఉండదు. అయితే పెద్దలు ఎక్కువగా అమ్మాయి అయినా.. అబ్బాయికి అయినా గుణాలను ఎక్కువగా చూస్తుంటారు. అందం కంటే.. వ్యక్తిత్వానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. ఇలా చేయడం మంచిదని.. ఆయన సూచించాడు. (ప్రతీకాత్మక చిత్రం)