ఈసారి చైత్ర నవరాత్రులు చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే హిందూ నూతన సంవత్సరం చైత్ర నవరాత్రుల (Navratri) నుంచే ప్రారంభమైంది. దేశమంతటా నవరాత్రి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంంటున్నారు. నవరాత్రులలో రెండు ముఖ్యమైన రోజులు అష్టమి, నవమి. అష్టమి, నవమి రోజుల్లో భక్తులు ఉపవాసం ఉంటారు. వారి ఇళ్లలోని, కుటుంబాల్లోని పెళ్లి కావాల్సి ఉన్న ఆడపిల్లలను పూజిస్తారు. పెళ్లి కావాల్సి ఉన్న ఆడపిల్లలను దుర్గా స్వరూపంగా భావిస్తారు.
అయితే చైత్ర నవరాత్రుల్లో జగత్ జననీ జగదాంబతో పాటు రాముడిని కూడా పూజిస్తారని అయోధ్య జ్యోతిష్యుడు పండిట్ కల్కి రామ్ తెలిపారు. నవరాత్రుల్లో అష్టమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గౌరీ దేవిని ఆచార పద్ధతిలో పూజిస్తారు. అష్టమి రోజున కొన్ని పనులు చేయడం ద్వారా గౌరీమాత ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. పేదరికం నశించి, సుఖసంతోషాలు లభిస్తాయి.