కొంతమంది సామాజికంగా కొందరితో చాలా యాక్టివ్‌గా ఉంటారు. వాళ్లలో వాళ్లు తెగ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ అందరినీ వారితో కలవనివ్వరు. కొందరు కిటికీల పక్కన, కర్టెన్ల పక్క నుంచి ఎదుటి వారి ఇంట్లో రహస్యాల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇంకొందరు మీతో సరిగ్గా మాట్లాడకపోయినా మీరు చేసే పనులు అన్నింటిపైనా ఓ కన్నేసి ఉంచుతారు.
* కర్కాటక రాశి (Cancer) : కర్కాటక రాశివారు కొత్త వారితో అస్సలు కలవలేరు. దీంతో ఇంటి చుట్టుపక్కల ఉన్న వారితో సత్సంబంధాలు ఉండవు. ఎవరితోనూ దీర్ఘకాలంపాటు ఉండే స్నేహాలు చేయలేరు. సహజంగా రిజర్వ్డ్ గా ఉండే మనుషులు. కొత్తవారి దగ్గర వీరు చాలా అసౌకర్యంగా ఉంటారు. ఇరుగుపొరుగు వారి దగ్గర కూడా చాలా భయంతో, ఒత్తిడితో ఉన్నట్లు కనిపిస్తారు.
* మిథున రాశి (Gemini) : ఈ రాశి వారు ఇతరులకు ఇబ్బందికరంగా మారతారు. మీ ఇంట్లోని వస్తువులను ఎగతాళి చేయడం లాంటివి చేస్తుంటారు. మిమ్మల్ని గురించి చెప్పి మీ తల్లిదండ్రులను నవ్వించడం లాంటి అభ్యంతరకరమైన పనులను చేస్తుంటారు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంత మంచిగా ఉండదు. ఇరుగు పొరుగు వారితో ఎలా సత్సంబంధాలు ఏర్పరుచుకోవాలో వీరికి తెలియదు. మనస్పూర్తిగా ఇతరులతో మాట్లాడలేరు. దీంతో వీరు అర్థం లేని, అసందర్భం హాస్యం పండించాలనుకుంటారు.
* వృశ్చిక రాశి (Scorpio) : వీరు అనవసరమైన సంభాషణలతో మొదలుపెట్టి, వారికి కావాల్సిన విషయాలను రాబట్టుకుంటారు. తమ కిటికీ కర్టెన్ల చాటు నుంచి నిశబ్దంగా నిలబడి ఇతరులు ఏం చేస్తున్నారో చూడటానికి ప్రయత్నిస్తుంటారు. వీరు స్వతహాగా లోపల పిరికిగా ఉంటారు. ఇంట్రావర్ట్‌లుగా ఉంటారు. సామాజికంగా అందరితో కలవడానికి అంతగా ఇష్టం చూపించరు. అయినా సరే వీరికి ఇతరుల విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.
* కన్య (Virgo) : కన్యా రాశి వారు చాలా తెలివైనవారు. వారికి సామాజికమైన విషయాల పట్ల అంతగా అవగాహన ఉండదు. వీరు ఎప్పుడూ ఎదుటి వారి రహస్యాలను తెలుసుకోవాలే కుతూహలంతో ఉంటారు. వారి సమస్యలలో వీరు సాయం చేయగలిగింది ఏదీ లేకపోయినా సరే వారి విషయాలలో తలదూర్చాలని చూస్తారు. ఈ స్వభావంతో వీరు పొరుగు వారిని ఎప్పుడూ చికాకుకి గురి చేస్తుంటారు.
* కుంభ రాశి (Aquarius) : వీరు ఒక రకమైన సోషల్ డిస్కంఫర్ట్తో ఉంటారు. వీరిని చూడగానే వీరు ఏదో అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నట్లు కనిపిస్తారు. అందరిలో ఆత్మవిశ్వాసంగా కనిపించలేకపోవడం వల్ల వీరు సిగ్గు పడుతున్నట్లుగా ఉంటారు. కొంత కాలానికి అది మరీ ఎక్కువై ఇతరులతో మాట్లాడటానికి, గడపడానికి ఇష్టం లేనట్లుగా తయారవుతారు. ఇలాంటి పొరుగు వారితో ఎవరూ సౌకర్యంగా ఉండలేరు.