నెమలి ఈకలను చూడటం: మీరు ఉదయాన్నే ఆఫీసుకు లేదా పని ప్రాంతానికి బయలుదేరి వెళ్లిన తర్వాత, బయటకు వెళ్లేటప్పుడు నెమలి కనిపిస్తే.. అది మీకు చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీరు మీ పని రంగంలో పురోగతిని పొందబోతున్నారని ఇది సూచిస్తుంది. నెమలి ఈకలు మరియు నెమలి శబ్దం వినడం కూడా మీకు పురోగతి తలుపులు తెరిచినంత ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
వెళుతున్న నెమలిని చూడటం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు ఇంటి నుండి ఏదైనా పని మీద వెళుతున్నప్పుడు.. దారిలో ఎక్కడికో వెళుతున్న నెమలిని చూస్తే.. మీ పంట పండినట్టే అని అర్థం చేసుకోండి. ఈ సంకేతం మీ అదృష్టాన్ని పెంచుతుంది. బయటకు వెళ్ళేటప్పుడు నెమలిని చూడటం కూడా ఇంట్లో శుభకార్యానికి సంకేతంగా పరిగణించబడుతుంది.