మకరం : వృశ్చికరాశిలో ఏర్పడే ఈ బుధాదిత్య యోగం మకర రాశి వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మకర రాశి వారు ఈ కాలంలో లాభాల్లో ఉంటారు. బంధువులు మరియు స్నేహితులతో సంబంధాలు బలంగా ఉంటాయి. మీ డబ్బు కొంత అప్పులో కూరుకుపోయినట్లయితే, దానిని పొందే బలమైన అవకాశం ఉంది. గౌరవం పెరుగుతుంది. దీంతో పాటు.. మీ ఆఫీస్ లో అధికారులు నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి.