కర్కాటక రాశి : కన్య రాశిలోకి బుధుడు సంచరించడం వల్ల కర్కాటక రాశి వారికి చాలా లాభదాయకంగా ఉండనుంది. ఈ రాశి వారికి చెందిన సోదరులు, స్నేహితుల మధ్య సఖ్యత పెరుగుతుంది. జర్నలిజం, రచన విభాగాల్లో పని చేసే వారికి శుభ ఫలితాలు. వినూత్న ఆలోచనలతో వీరు లాభాలను గడించే అవకాశం ఉంది. వ్యాపారంలో ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే. (ప్రతీకాత్మక చిత్రం)
కన్య రాశి : బుధుడు సొంత రాశిలోకి ప్రవేశించడంతో కన్య రాశి వారికి ఊహించని లాభాలు చేకూరనున్నాయి. వచ్చే రెండు నెలల పాటు వీరు ఊహించని మార్పులను చూస్తారు. అనారోగ్యంతో బాధ పడేవారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. డబ్బుకు కొదవ లేకుండా ఉంటుంది. సంఘంలో గౌరవం.. వ్యాపారంలో లాభాలు.. విద్యార్థులకు విదేశీ యానం ఇలా అన్ని రంగాల వారికి లాభ దాయకంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)