కన్యా రాశి వారికి ఈ బుధ సంచారము శుభప్రదంగా ఉండనుంది. వీరి ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పు ఉంటుంది. కుటుంబంలో సంతోషం, శాంతి వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుతాయి. అయితే బుధ సంచార కాలంలో ఈ రాశి వారు అప్పుగా డబ్బు తీసుకోకుండా ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటక రాశికి చెందిన వారికి బుధుడు చాలా ప్రత్యేకం. ఈ కాలంలో వీరికి పూర్వీకుల ఆస్తి నుంచి లాభాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. దీనితో పాటు ఉద్యోగం చేసే చోట మంచి మార్పులు కనిపిస్తాయి. మీరు వ్యాపారంలో ఆర్థిక పెట్టుబడుల ద్వారా ప్రయోజనాన్ని పొందవచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులారాశిలో బుధుడు సంచరించడం మిథునరాశి వారికి విశేషమైన ప్రయోజనాలను కలుగుజేస్తుంది. ఈ సమయంలో వీరికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. నిలిచిపోయిన వ్యాపారాలను మళ్లీ ఆరంభించి సక్సెస్ అవుతారు. వసూలు కావల్సిన డబ్బు చేతికి అందుతుంది. అయితే ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో మీ పై అధికారులు మీపై మంచి అభిప్రాయంతో ఉంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
సింహ రాశి వారికి బుధుడి సంచారము ప్రయోజనకరంగా ఉండనుంది. ఈ రాశుల వారు కొత్త వ్యాపారాలను ఆరంభించేందుకు అక్టోబర్ 26 నుంచి మంచి సమయం. ఆర్థిక పురోగతిని చూడవచ్చు. ఉద్యోగం చేసే వారికి జీతం పెరగవచ్చు. మీకు వేరే కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ రావొచ్చు. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు బుధుడు మారడం విశేషం. ఈ సమయంలో మీరు పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)