జ్యోతిష్యంలో గ్రహాల అస్తంగత్వానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అస్తంగత్వం వల్ల గ్రహాలు తమ శక్తిని కోల్పోయి.. రాశులపై ప్రభావం చూపుతాయి. మార్చి 18న బుధుడు అస్తమించబోతున్నాడు. జ్యోతిష్యంలో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది. బుధ గ్రహం మేధస్సు, తర్కం, కమ్యూనికేషన్, గణితం, తెలివి, స్నేహానికి కారకంగా భావిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రతి గ్రహం సూర్యుడికి 6 డిగ్రీల దగ్గరకు వచ్చినప్పుడు గ్రహాలు అస్తంగత్వం చెందుతాయి. దీనినే వాడుక భాషలో మూఢమి అంటారు. సూర్యుడికి దగ్గరగా వచ్చిన గ్రహం తన కాంతిని కోల్పోతుంది. అప్పుడు ఆ గ్రహాలు మనకు కనిపించవు. ఆ సమయంలో గ్రహాలు తన కారకత్వాలను కోల్పోతాయి. తాను ఇవ్వాల్సిన ఫలితాలు ఇవ్వదు. దీని వల్ల కొన్ని రాశులకు ఇబ్బందులు తలెత్తుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని గ్రహాలు అస్తంగత్వం చెందుతాయి. గ్రహాలు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు.. అవి తమ కాంతిని కోల్పోయి.. మనకు కనిపించవు. రాహు, కేతువుల ఛాయా గ్రహాలు కాబట్టి.. అస్తంగత్వం ఉందు. ఈ రాహు, కేతువుల వల్ల సూర్యుడికి గ్రహణం ఏర్పడుతుంది. బుధుడి అస్తమయం వల్ల పలు రాశుల వారికి కష్టాలు వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)