ఇంటి ముందు తులసి కోట ఉంటే చాలు... అంతా మంచే జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. రోజూ తులసికి పూజ చేసి... దీపం వెలిగిస్తారు. ఐతే... కొంత మంది తెలియక తులసి ఆకులను వాడకూడని విధంగా వాడుతుంటారు. ఇలా చేస్తే... తులసి మాతకు ఆగ్రహం వస్తుందని పండితులు చెబుతున్నారు. తల్లికి ఆగ్రహం వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
పరమేశ్వరుడి పూజ చేసేటప్పుడు... తులసి ఆకులను వాడకూడదు. ఎందుకంటే... రాక్షస రాజైన జలంధరుడు తులసి మాత భర్త. ఆయన్ని ఎవరూ చంపనివ్వకుండా వరం ఉంది. ఐతే... ఓసారి దేవేంద్రుడితో యుద్ధం జరిగింది. ఆ సమయంలో దేవేంద్రుడు... తనను రక్షించమని శివుడిని కోరాడు. ఆ క్రమంలో శివుడు ఇచ్చిన సలహాతో జలంధరుడు చనిపోతాడు. దాంతో ఆగ్రహించిన తులసిమాత... ముక్కంటి పూజకు తనను వాడరాదని శపించారు. అందువల్ల శివలింగానికి పూజ చేసేటప్పుడు తులసి ఆకులను వాడరు. (ప్రతీకాత్మక చిత్రం)
పండుగలు, ప్రత్యేక పర్వదినాల నాడు తులసి ఆకులను తెంపకూడదు. ముఖ్యంగా ఏకాదశి, ఆదివారం, సూర్యగ్రహణం, చంద్ర గ్రహణం సమయంంలో తులసి జోలికి వెళ్లకూడదు. అలా చేస్తే తులసి మాతకు వచ్చే ఆగ్రహం అత్యంత ఎక్కువగా ఉంటుందనీ... భయంకరమైన వ్యాధులు సోకే ప్రమాదం ఉందని పండితులు చెబుతున్నారు. ఒక్కోసారి ప్రియమైన వారు చనిపోయే ప్రమాదం కూడా ఉందంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
తులసి మొక్కను ఎట్టి పరిస్థితుల్లో ఇంటి లోపల ఉంచొద్దు. జలంధరుడి మరణం తర్వాత... విష్ణుదేవుడు తులసి మాతను ఆశీర్వదించాడు. ప్రతి ఇంట్లో నిన్ను పూజిస్తారు అని ఆశీర్వదించారు. ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో... వారికి విష్ణుమూర్తి కరుణ కటాక్షాలు ఉంటాయట. ఐతే... తులసిని తెచ్చి పెట్టుకుంటే సరిపోదు. చాలా జాగ్రత్తగా పెంచాలి. ఇంటి లోపల పెడితే ఎండ తగలక ఆకులు వాడిపోయి... మొక్క చనిపోతుంది. తులసి మొక్క చనిపోతే... తప్పిదం జరిగినట్లే. కాబట్టి... ఇంటి బయటే మొక్కను ఉంచి... జాగ్రత్తగా పెంచుకోవాలని పండితులు సూచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)