జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం 12 రాశులున్నాయి. ఐతే ఈ పన్నెండు రాశుల్లో కొన్నింటిపై వినాయకుడు ప్రత్యేక అనుగ్రహం చూపుతాడు. దేవుళ్లందరిలోకెల్ల మొట్ట మొదటగా పూజలందుకునే దైవం.. గణపతి. ఆయన విఘ్నాలకు అధిపతి. అందుకే తమ జీవితంలో ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలని అందరూ వినాయకుడిని పూజిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
మేష రాశి (Aries): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మేషరాశిపై గణేశుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. వీరు మేధావులు. వీరికి ఆత్మ విశ్వాసం ఎక్కువ. ప్రతిదానిలో నైపుణ్యం కలిగి ఉంటారు. గణేశుడి అనుగ్రహం వల్ల మేష రాశి వారు తమ రంగంలో విజయం సాధిస్తారు. అందుకే మేష రాశి వారు ప్రతినిత్యం గణేశుడిని పూజించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
మిథున రాశి (Gemini): గణేశుడు మిథున రాశి వారిపై ఎంతో దయతో ఉంటాడు. ఈ వ్యక్తులు చాలా తెలివైనవారు. దయ స్వభాగం కలిగిన వారు. మిథున రాశి వారు చదువుల్లో చురుగ్గా ఉంటారు. అందుకే విద్యారంగంలో విజయాలు సాధిస్తారు. వీరిపై విజయం గెలవడం అంత ఈజీగా కాదు. ఈ రాశుల వారు కూడా రోజూ వినాయకుడిని పూజించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
మకర రాశి (Capricorn): మకర రాశిపైనా వినాయకుడికి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. ఈ వ్యక్తులు కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. వీరిని గుడ్డిగా నమ్మేయవచ్చు. చాలా షార్ప్‌గా ఉంటారు. ఏదైనా అలవోగా నేర్చుకోగలరు. విద్యారంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ప్రతిరోజూ వినాయకుడిని ప్రార్థన చేస్తే మంచి జరుగుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)