Earn Money: మనిషికి ఏది లేకపోయినా ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే.. సమాజంలో గుర్తింపు వస్తోంది. మిగిలిన విషయాలు అన్ని తరువాత చూస్తున్నారు. బంధువులు సైతం డబ్బులు ఉంటేనే గుర్తిస్తున్నారు. రక్త సంబంధీకులు సైతం డబ్బు లేని వారిని హీనంగానే చూసే పరిస్థితులు వచ్చేశాయి. అందుకే ఇప్పుడు అందరికి డబ్బు సంపాదనే ప్రథాన లక్ష్యంగా మారింది.
ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో ప్రతి వ్యక్తికి సమాజంలో గుర్తింపు పొందుతూ.. ధనవంతుడిగా జీవించాలని కోరుకుంటాడు. అలా కోరుకోవడం తప్పు కూడా కాదు. అయితే ఎంత కష్టపడినా అందరూ ఆ స్థాయికి చేరలేరు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఆదాయం ఉన్నా నిలుపుకునే తెలివితేటలు లేకపోవడం.. నష్టం రావడం.. దుబారా పెరిగిపోవడం.. అనుకోని ఖర్చులు పెరిగిపోవడం ఇలా చాలా కారణాలతో ఆ వచ్చిన డబ్బు నిలవదు..
వృత్తిలో విజయం, గౌరవం, పురోగతిని ఇచ్చే గ్రహం సూర్యుడు అంటారు. మని మన జాతకంలో సూర్యుడు బలపడాలంటే ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యాన్ని తప్పక సమర్పించాలి అంటున్నారు. కుదిరితే రోలీ, అక్షతలను నీటిలో వేస్తే తప్పక మంచి ఫలితాన్ని ఇస్తుందని సూచిస్తున్నారు. ఇలా చేస్తే కెరీర్ లో అడ్డంకులు అన్ని తొలగినట్టే.. ఆదాయం కూడా పెరుగుతుంది అంటున్నారు.
హిందూ మతంలో, తులసిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం.. మరి ఎవరైనా ధనవంతులు అవ్వాలి అంటే కచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అవసరం. అందుకే ఇంట్లో తులసి మొక్కను నాటి ప్రతి రోజూ.. పూజించాలి. రోజూ ఉదయాన్నే తలస్నానం చేసి తులసికి నీళ్ళు సమర్పించాలి. సాయంత్రం పూట తులసి పూతలో దీపం వెలిగించాలి. దీపం అరిపోయిన తరువాత.. తులసి కోట నుండి దానిని తీసివేయడం మరిచిపోకూడదు.
ముఖ్యంగా రాత్రిపూట ఇంటి వంటగదిని శుభ్రంగా ఉంచాలి. మురికిగా ఉంచడం, మురికి పాత్రలు ఉంచడం లక్ష్మి దేవీ, అన్నపూర్ణ దేవీకి కోపం తెప్పిస్తుంది అంటున్నారు. అందుకే ఈ తప్పు ఎప్పుడూ చేయకూడదని సూచిస్తున్నారు. నిత్యం పడుకునే ముందైనా వంటగదిని శుభ్రం చేయాల్సిందే అంటున్నారు. ఈ ఐదు సూత్రాలు నిత్యం పాటించేవారి ఇంట్లో ఆదాయానికి కొదవుండదు అంటున్నారు.