Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో ఏవో ఒక సీక్రెట్లు ఉంటాయి. కొంత మంది డబ్బు బ్యాంకుల్లో దాచి... సీక్రెట్‌గా ఉంటారు. ఇంకొంత మంది ప్రేమలో పడి... ఆ విషయాన్ని చెప్పకుండా సీక్రెసీ మెయింటేన్ చేస్తారు. మరికొందరు ఏదో తప్పు చేసి రహస్యంగా ఉంటారు. అలా సీక్రెట్లను తమలోనే దాచుకోలేక... వాటిని తమకు బాగా దగ్గరైన వారితో పంచుకుంటారు. ఈ విషయం ఎవరికీ చెప్పకు అని అంటారు. అవతలి వారు అలాగే... ఎవరికీ చెప్పను అంటారు... తీరాచూస్తే చెప్పేస్తారని జ్యోతిష పండితులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇలా రహస్యాల్ని బయటపెట్టేసే రాశులు 5 ఉన్నాయి. వీళ్లు సీక్రెసీ మెయింటేన్ చెయ్యలేరు వారి వల్ల కాదు. ఎవరైనా ఫలానా విషయంపై గుచ్చి గుచ్చి అడిగితే... బయటపెట్టేస్తారు. ఆ తర్వాత చిక్కుల్లో పడేది వీరికి రహస్యం చెప్పినవారే. ఇలా ఎందుకు చెప్పేస్తారంటే... సీక్రెట్‌ని తమలోనే దాచుకుంటూ ఉండటం వారి వల్ల కాదు. అదో భారంలా, ఇబ్బందిగా అనిపిస్తుంది వారికి. ఆ లోడ్ దించేసుకోవడానికి ఇతరులకు చెప్పేసి మనసు తేలిక చేసుకుంటారని జ్యోతిష పండితులు వివరిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం (Cancer) కర్కాటక రాశి వారికి చందమామ ప్రధానమైనది. వీరు ఏం చేసినా, ఏ నిర్ణయాలు తీసుకున్నా... చంద్రుడి ప్రభావం ఉంటుంది. ఇది మంచిదే కానీ... వీళ్లకు ఫిక్స్డ్ మైండ్ ఉండదు. దేనికీ పూర్తిగా కనెక్ట్ కారు. ఒక్కోసారి ఒక్కోలా వ్యవహరిస్తారు. వీరితో ఎవరైనా నాలుగు మాటలు మాట్లాడితే చాలు... వారితో మాటలు కలిపేసి... విపరీతంగా మాట్లాడేస్తూ... చివరకు చెప్పకూడని రహస్యాలన్నీ టకటకా చెప్పేస్తారు. అంతా అయిపోయాక... అదేంటి అలా చెప్పేశాను... ఇప్పుడు ఏమవుతుందో ఏమో అని టెన్షన్ పడతారు. అందువల్ల ఈ రాశి వారితో సీక్రెట్లు అస్సలు పంచుకోకూడదు. వాటిని దాయడం వీళ్ల వల్ల కానే కాదు.
మిథున రాశి (Gemini) గ్రహాల్లో చిన్నదైన బుధగ్రహం మిథున రాశి వారికి కీలకమైనది. ఈ రాశి ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరు ఇతరులతో చాలా క్లోజ్‌గా ఉంటారు. బాగా మాట్లాడుతారు. చెలాకీగా ఉంటారు. మానవ సంబధాల విషయంలో ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉంటారు. వీరు దేన్నీ పూర్తి సీరియస్‌గా తీసుకోరు. అందువల్ల ఎవరైనా వీరికి రహస్యాలు చెప్పి... ఎవరికీ చెప్పొద్దు అంటే... నేనెందుకు చెబుతా అని అంటారు. తీరా... నలుగురితో మాట్లాడేటప్పుడు... ఈజీగా రహస్యాన్ని చెప్పేస్తారు. తాము చెప్పకూడనిది చెప్పేస్తున్నామనే ఫీలింగ్ వీరిలో అస్సలు ఉండదు. వీరికి తెలియకుండానే అలా చేసేస్తారు. ఆ తర్వాత ఏమైనా జరగొచ్చు.
మేష రాశి (Aries) మార్స్ (అంగారకం లేదా కుజ గ్రహం లేదా మంగళ గ్రహం లేదా అరుణ గ్రహం) ప్రభావం మేష రాశి వారిపై ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు చాలా చెలాకీగా చురుగ్గా ఉంటారు. అయితే ఈ యాక్టివ్ పర్సనాల్టీయే రహస్యాలను దాచుకోనివ్వకుండా చేస్తుంది. ఆనందం ఎక్కువై గబుక్కున సీక్రెట్ చెప్పేస్తారు. ఆ తర్వాత దాన్ని కవర్ చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తారు. కానీ అప్పటికే అవతలి వారికి మ్యాటర్ అర్థమైపోతుంది. ఆ తర్వాత ఏం జరిగినా.. ఎవరూ చేసేదేమీ ఉండదు.
ధనస్సు రాశి (sagittarius) గ్రహాల్లో అతి పెద్దదైన గురుగ్రహం (బృహస్పతి లేదా Jupiter) ప్రభావం ధనస్సు రాశి వారిపై చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు ఇతరుల్ని ఇట్టే ఆకర్షించగలరు. ఏం చేసినా గురి చూసి చెయ్యగలరు. ఐతే... సీక్రెట్లను దాచే విషయంలో మాత్రం వీరిది జీరో టాలెంటే. వీరితో ఎవరైనా మాట్లాడటం మొదలుపెడితే... ఇక అంతే... పూస గుచ్చినట్లు అన్నీ చెప్పేస్తారు. ఆ తర్వాత అలా ఎందుకు చెప్పావని అడిగితే... చెప్పానా.. లేదే.. ఏమో గుర్తులేదు అని తీవ్ర ఆందోళన, మానసిక వేదన చెందుతారు. అందువల్ల వీరికి రహస్యాలు చెప్పకపోవడం మేలు. చెబితే వీరితో ఉన్న సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
తుల రాశి (Libra) భూమికి దగ్గర్లోనే ఉంటూ... మెరిసే గ్రహం శుక్రుడు (Venus) ప్రభావం తుల రాశి వారిపై ఉంటుంది. అందుకే వీరు ఇతరులకు ప్రేమను పంచుతారు. ఆప్యాయంగా పలకరిస్తారు. మానవ సంబంధాలు బాగా పెంచుకుంటారు. ఎవర్నీ నొప్పించకుండా బ్యాలెన్డ్స్ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఐతే... సీక్రెట్లను దాచే విషయంలో మాత్రం వీరు గతి తప్పుతారు. వీరు చాలా విషయాలు తెలుసుకుంటారు గానీ... వాటిని తమలోనే దాచుకోవడం వీరికి సాధ్యపడదు. అందర్నీ నమ్మేస్తారు. రహస్యాలను వారికి చెప్పినా ఏం కాదని భావిస్తారు. లోపలున్నవి అన్నీ చెప్పేసి భారం దిగినట్లు ఫీలవుతారు. అందువల్ల తుల రాశి వారికి అన్నీ చెప్పేయకూడదు. (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these.)