Diwali 2020: అపురూపం.. ఆ రూపం..!! బంతిపూలతో బంగారు వర్ణంలో బద్రీనాథ్..
Diwali 2020: అపురూపం.. ఆ రూపం..!! బంతిపూలతో బంగారు వర్ణంలో బద్రీనాథ్..
దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదర్ నాథ్ అయితే దేదీప్యమానంగా వెలిగిపోయింది. బద్రీనాథ్ ను అలంకరించడానికి ఎన్ని బంతి పూలను వాడారో తెలుసా..?
దీపావళి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదర్నాథ్ బంగారు వర్ణంలో మెరిసిపోయింది. పండుగ సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. దీపావళి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
2/ 5
దీపావళి అలంకరణలో భాగంగా కేదర్నాథ్ ఆలయాన్ని మొత్తం బంతిపూలతో అలంకరించారు. చుట్టూ తెల్లటి మంచు.. పైన నీలి ఆకాశం.. మధ్యలో బంగారు వర్ణంలో ఉన్న బద్రీనాథున్ని చూడటానికి రెండు కళ్లు సరిపోలేదు.
3/ 5
బద్రీనాథుడిని అలంకరించడానికి సుమారు 10 క్వింటాళ్ల బంతిపూవులను వాడారట. దీంతో ఆలయం బంగారు వర్ణంలో ధగధగ మెరిసిపోయింది. మేలిమి బంగారు వర్ణంలో కొలువుదీరిన బద్రీనాథుడు.. ఆలయాధికారులు ఏర్పాటుచేసిన అలంకరణలతో మరింత శోభను సంతరించుకున్నాడు.
4/ 5
పండుగ సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు బద్రీనాథుడిని దర్శించుకున్నారు. దీంతో ఆలయాధికారులు వారికి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లుచేశారు. ప్రత్యేక పూజలు చేయడానికి భక్తులు ఉదయం నుంచే ఆలయానికి పోటెత్తారు.
5/ 5
ఈనెల 19న కేదర్నాథ్ ను మూసివేయనున్నారు. అక్టోబర్ 25న ఈ ఆలయాన్ని తెరిచిన అధికారులు.. త్వరలోనే దీనిని మూసేస్తారు. చలికాలం కావడంతో ఈ సమయంలో ఈ ప్రాంతంలో మంచు విపరీతంగా కురుస్తుంది. దీంతో ఆలయం కొద్ది నెలల పాటు మూసే ఉంటుంది.