దక్షిణాన తిరుమల ఎలా అభివృద్ధి చెందిందో.. ఉత్తరాన ఆ రేంజ్లో అయోధ్యను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. శ్రీరాముడి ఆలయ నిర్మాణంలో ప్రతీ అంశాన్నీ అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఈ క్రమంలో రాముడి విగ్రహ తయారీపైనా అంతే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. (image credit - twitter - rpsinghkhalsa)
దేశంలో చాలా మంది దేవుళ్లకు ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. కానీ రాముడికి మాత్రం తాను పుట్టిన చోట ఆలయం లేకపోవడం అనేది రామభక్తులకు ఆవేదన కలిగించే అంశం. అందుకే.. అయోధ్యలో భారీ రామాలయం నిర్మించాలని ఏళ్లుగా కోరుతూనే ఉన్నారు. వారి కల ఈ సంవత్సరం చివరి నాటికి నెరవేరనుంది. (image credit - twitter - rpsinghkhalsa)
రామాలయం ఎంత అందంగా నిర్మిస్తున్నారో... రామజన్మభూమి గర్భాలయంలో ప్రతిష్టించబోయే శ్రీరాముడి విగ్రహం కూడా అంతే అందంగా.. చూడచక్కగా ఉండనుంది. ఈ విగ్రహ తయారీ కోసం... రెండు ప్రత్యేక అరుదైన శిలలను ఎంపిక చేశారు. ఈ శిలలు ఈ గురువారం (02 ఫిబ్రవరి 2023) నాటికి అయోధ్య చేరుకుంటాయి. (image credit - twitter - rpsinghkhalsa)
ఆ రెండు శిలలలో ఒకటి 14 టన్నుల బరువు ఉంది. మరొకటి 26 టన్నుల బరువు ఉంది. ఇవి 7 అడుగుల ఎత్తు ఉన్నాయి. ఈ శుక్రవారం ఆ శిలలు నేపాల్ నుంచి రెండు లారీలలో బయలుదేరాయి. అవి ఏమాత్రం చెక్కు చెదరకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. వాటిని నెమ్మదిగా తీసుకొస్తున్నారు. అందువల్లే అవి రావడానికి ఎక్కువ టైమ్ పట్టబోతోంది. (image credit - twitter - rpsinghkhalsa)
అటు అయోధ్య విమానాశ్రయ ప్రాజెక్ట్ పనులు 2023 జూన్ నాటికి పూర్తవుతాయని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఇదివరకు అంచనా వేసింది. ఈ ఎయిర్పోర్ట్ అభివృద్ధి ప్రాజెక్ట్ విలువ రూ.242 కోట్లు. ఇందులో టెర్మినల్ భవనం నిర్మాణం, ఎయిర్‌సైడ్ సౌకర్యాల అభివృద్ధి వంటివి కీలకంగా ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్‌లో అడుగడుగునా ఆధ్యాత్మిక భావం కలిగేలా ఉంటుందనీ.. రాకపోకలు సాగించే ప్రయాణికుల్లో భక్తిభావం ఉప్పొంగేలా చేస్తామని అధికారులు తెలిపారు. (image credit - twitter - rpsinghkhalsa)
2023 డిసెంబర్ నాటికి అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తవుతుంది. ఎయిర్పోర్ట్.. రామాలయానికి 7కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి రామజన్మభూమికి భక్తులు నేరుగా వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా చాలా త్వరగా స్వామివారిని దర్శించుకునేందుకు వీలు కలుగనుంది. దీని ద్వారా ఏడాదికి 6 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు వీలవుతుంది. రద్దీ సమయాల్లో ఒకేసారి 300 మంది ప్రయాణికులకు సేవలందించేలా రూపొందిస్తున్నారు. (image credit - twitter - rpsinghkhalsa)