Astrology - Ugadi 2023: వివిధ రాశులకు సంబంధించి శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఫలితాలను ఇక్కడ అందజేస్తున్నాం. ప్రధానగ్రహాలైన శనీశ్వరుడు, గురువు, రాహువు, కేతువుల స్థితిగతులను బట్టి ఇతర గ్రహాల సంచారాన్ని బట్టి ఈ రాశుల ఫలితాలను చెప్పడం జరుగుతోంది. అయితే, వ్యక్తిగత జాతక చక్రాలను ఆధారం చేసుకుని ఫలితాలను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అయితే శోభకృత్ నామ సంవత్పరం సందర్భంగా సినిమాలతో ఈ రాశులకు ఈ యేడాది ఎలా ఉండనుందో చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 12 రాశులకు 12 సినిమాలు చూపించబోతున్న గ్రహాలు..
వృషభ రాశి (Taurus) : మంచి రోజులు వచ్చాయి.. ఈ సినిమా టైటిల్‌ను బట్టి.. గత కొన్ని రోజులుగా అనుభవిస్తున్న కష్టాలు.. దూది పింజలా ఎగిరిపోయనున్నాయి. 12 వ ఇంట గురుడు ఉన్నా.. మిగిలిన గ్రహాలు అనుకూల స్థానంలో ఉండటంతో ఈ రాశి వారికి మంచి రోజులు వచ్చాయి అనే సినిమా టైటిల్ కరెక్ట్‌గా సరిపోయింది. ఈ రాశి వారికి ఆదాయం -14.. వ్యయం -11.. రాజ్యపూజ్యం -, అవమానం -1
మిథున రాశి (Gemini) : అప్పుల అప్పారావు.. ఈ టైటిల్‌ను బట్టి చెప్పొచ్చు. ఈ రాశుల వారికి ఆదాయం -2, ఖర్చు -11 ఉంది. ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉండటంతో ఈ రాశి వారికి అప్పుల అప్పారావు అనే టైటిల్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. రాజ్యపూజ్యం -2, అవమానం -4 ఉంది. ఈ రాశుల వారికి గత కొన్నేళ్లుగా పట్టి పీడిస్తోన్న అష్టమ శని తొలగడం విశేషం.
కర్కాటక రాశి (Cancer) : సూపర్ ..ఈ మూవీ టైటిల్‌ను బట్టి చెప్పొచ్చు వీళ్లకు ఈ యేడాది అంతా సూపర్ అని చెప్పాలి. ఈ రాశి వారికి ఆదాయం.. 11..ఖర్చు - 8. రాజ్యపూజ్యం -5, అవమానం -4. ఈ రాశి వారికి గురుడు ధన స్థానమైన 10వ ఇంట్లో.. రాహు, కేతువులు శుభ స్థానంలో ఉన్నాయి. శనీశ్వరుడు 8వ స్థానంలో ఉండటంతో మిశ్రమంగా ఉంటుంది.
మీన రాశి (Pisces) : ‘బ్యాండ్ బాజా బారాత్ .. ఈ మూవీ టైటిల్‌ను బట్టి ఈ రాశుల వారికి ముందు వెనక వాయింపు ఓ రేంజ్లో ఉండనుంది. ఖర్చు విషయంలో అప్రమత్తతతో మెలగాలి. ఈ రాశి వారికి ఆదాయం -8.. వ్యయం -11.. రాజ్యపూజ్యం.. 1.. అవమానం -2. ఆయా రాశుల వారు గురు, శని వార నియమాలు పాటించి నవ గ్రహాల తీవ్రతను తగ్గించుకోవచ్చు.